iDreamPost
android-app
ios-app

DC vs MI: వీడియో: మరోసారి పాండ్యా పరువుపోయింది.. నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో!

  • Published Apr 27, 2024 | 7:33 PM Updated Updated Apr 27, 2024 | 7:33 PM

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరువు మళ్లీ పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరువు మళ్లీ పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

DC vs MI: వీడియో: మరోసారి పాండ్యా పరువుపోయింది.. నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో!

హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అత్యంత దురదృష్టమైన కెప్టెన్. గుజరాత్ నుంచి వచ్చి ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు హార్దిక్. కానీ సారథిగా పగ్గాలు చేపట్టిన సంతోషం కంటే, ఎందుకు కెప్టెన్ గా వచ్చానా? అన్న బాధే ఎక్కువగా ఉన్నట్లుంది. టోర్నీలో వరుస ఓటములు ఒకవైపు, జూనియర్లు కూడా పట్టించుకోకపోవడం మరోవైపు. ఇవన్నీ కాదన్నట్లుగా మ్యాచ్ జరుగుతున్న ప్రతీసారి ప్రేక్షకుల నుంచి విమర్శలు. దీంతో పాండ్యా మానసికంగా కుంగిపోయాడు. ఇక తాజాగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి పాండ్యా పరువుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ తో తలపడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలి ఓవర్ నుంచే ముంబై బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు జేక్ ఫ్రేజర్. అతడిని ఆపడం ఆఖరికి బుమ్రా వల్ల కూడా కాలేదు. ఫ్రేజర్ (84), షై హోప్(41) అదరగొట్టారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా దారుణంగా విఫలం అయ్యాడు హార్దిక్ పాండ్యా. తొలి ఓవర్ నుంచే అతడు టీమ్ ను పట్టించుకోవడం మానేశాడు. ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపడం అతడి తరం కాలేదు. దీంతో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మధ్యలో ఫీల్డ్ సెట్ చేశాడు. యంగ్ ప్లేయర్లు సైతం రోహిత్ సూచనలు తీసుకునేందుకు మెుగ్గు చూపడంతో.. పాండ్యా బిక్క మెుఖం వేశాడు. ఈ మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. తొలి రెండు ఓవర్లలో ఢిల్లీ 37 రన్స్ చేసింది. అప్పుడు పాండ్యా బౌండరీ లైన్ దగ్గర కామ్ గా ఫీల్డింగ్ చేస్తుంటే.. రోహిత్ ఫీల్ట్ సెటప్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు పాండ్యా పరువు మళ్లీ పోయింది, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అటు కెప్టెన్ గానే కాకుండా ఇటు బౌలర్ గా కూడా దారుణంగా విఫలం అయ్యాడు పాండ్యా. ఈ మ్యాచ్ లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 41 రన్స్ ఇచ్చుకున్నాడు. ఇక బ్యాటింగ్ లో మాత్రం పర్వాలేదనిపించాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరి ప్రస్తుత ఐపీఎల్ లో పాండ్యా పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.