Somesekhar
IPL 2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? పృథ్వీ షా ఔటా? నాటౌటా?
IPL 2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? పృథ్వీ షా ఔటా? నాటౌటా?
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4వ విజయాన్ని నమోదు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై 4 రన్స్ తో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఢిల్లీ విధించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడి ఓడిపోయింది గుజరాత్. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? పృథ్వీ షా ఔటా? నాటౌటా?
ఐపీఎల్ 2024 సీజన్ లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. మెున్న కోహ్లీ ఔట్ పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా.. తాజాగా ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ లో పృథ్వీ షా ఔట్ కూడా వివాదానికి దారితీసింది. అసలేం జరిగిందంటే? ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేశాడు సందీప్ వారియర్. ఈ ఓవర్ 5వ బంతిని షార్ట్ పిచ్ డెలివరీగా సంధించగా.. షా భారీ షాట్ కు ప్రయత్నించాడు. కానీ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. డీప్ బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో పరిగెత్తుకొచ్చిన నూర్ అహ్మద్ డైవ్ చేస్తూ.. సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గుజరాత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
అయితే ఫీల్డ్ అంపైర్ కు క్లీన్ క్యాచ్ అవునా? కాదా? అన్న అనుమానం రావడంతో.. థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. ఇక పలు కోణాల్లో క్యాచ్ ను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి కింద చేతి వేళ్లు ఉన్నాయని తన నిర్ణయాన్ని ఔట్ గా ప్రకటించాడు. కానీ తర్వాత రిప్లేలో చూస్తే బంతి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో అందరూ షాక్ కు గురైయ్యారు. అయితే కామెంటేటర్ లు ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్ ను పట్టుకునే క్రమంలో బంతి నేలను తాకినట్లు చెప్పారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం 225 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ చివరి వరకు పోరాడి 4 రన్స్ తో ఓడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పృథ్వీ షా ఔటా? నాటౌటా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Woah 🔥🔥
Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2
— IndianPremierLeague (@IPL) April 24, 2024