iDreamPost

IPLలో మరో కొత్త రూల్? ఇది వస్తే మాత్రం బ్యాటర్స్​కు చుక్కలే!

  • Published Apr 24, 2024 | 9:59 PMUpdated Apr 24, 2024 | 9:59 PM

క్రికెట్​ ఫ్యాన్స్​ను ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తోంది ఐపీఎల్. హైస్కోరింగ్ మ్యాచులు, ఫైనల్ ఓవర్ థ్రిల్లర్స్​తో క్యాష్ రిచ్ లీగ్ అందరికీ మస్తు వినోదాన్ని పంచుతోంది. అలాంటి ఈ లీగ్​లో మరో కొత్త రూల్​కు రూట్ క్లియర్ అయిందని తెలుస్తోంది.

క్రికెట్​ ఫ్యాన్స్​ను ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తోంది ఐపీఎల్. హైస్కోరింగ్ మ్యాచులు, ఫైనల్ ఓవర్ థ్రిల్లర్స్​తో క్యాష్ రిచ్ లీగ్ అందరికీ మస్తు వినోదాన్ని పంచుతోంది. అలాంటి ఈ లీగ్​లో మరో కొత్త రూల్​కు రూట్ క్లియర్ అయిందని తెలుస్తోంది.

  • Published Apr 24, 2024 | 9:59 PMUpdated Apr 24, 2024 | 9:59 PM
IPLలో మరో కొత్త రూల్? ఇది వస్తే మాత్రం బ్యాటర్స్​కు చుక్కలే!

క్రికెట్​ ఫ్యాన్స్​ను ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తోంది ఐపీఎల్. హైస్కోరింగ్ మ్యాచులు, ఫైనల్ ఓవర్ థ్రిల్లర్స్​తో క్యాష్ రిచ్ లీగ్ అందరికీ మస్తు వినోదాన్ని పంచుతోంది. అలాంటి ఈ లీగ్​లో మరో కొత్త రూల్​కు రూట్ క్లియర్ అయిందని తెలుస్తోంది. సాధారణంగా క్రికెట్​లో అప్పుడప్పుడూ కొత్త నిబంధనలు తీసుకురావడం చూస్తూనే ఉంటాం. ఇంటర్నేషనల్ క్రికెట్​లోనైతే ఆ బాధ్యతను ఐసీసీ చూసుకుంటుంది. కానీ లీగ్స్​లో మాత్రం ఆయా దేశ బోర్డులే చూసుకుంటాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్​ను మరింత రసవత్తరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బీసీసీఐ ఓ కొత్త రూల్​కు స్వీకారం చుట్టిందని తెలుస్తోంది. అది గానీ అమల్లోకి వస్తే ఇక బ్యాటర్ల పని ఫినిష్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటా రూల్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్ ఇప్పుడు బ్యాటర్స్​ గేమ్​లా మారిపోయింది. ఫ్లాట్ పిచ్​లు ఎక్కువవడంతో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. భారీగా పరుగులు బాదుతూ బౌలర్లను వణికిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా కొందరు స్మార్ట్ బౌలర్స్ ఉన్నారు. వాళ్లు పిచ్​తో సంబంధం లేకుండా తెలివిగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్​మెన్​ను భయపెడుతున్నారు. అలాంటి వాళ్లకు మరింత ఊతం ఇచ్చేలా ఐపీఎల్​లో ఓ కొత్త రూల్ రానుందని తెలుస్తోంది. ఇక మీదట లీగ్​లో ఒక్కో బౌలర్​కు 5 ఓవర్లు ఇవ్వాలని భావిస్తున్నారట. దీని వల్ల బాల్​కు బ్యాట్​కు మధ్య మరింత బ్యాలెన్స్ ఏర్పడుతుందని అనుకుంటున్నారట. త్వరలో ఈ రూల్​ను ఐపీఎల్​లో అమలు చేసేందుకు నిర్వాహకులు డిసైడ్ అయ్యారని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఒకవేళ ఒక్కో బౌలర్​కు 5 ఓవర్ల రూల్ గనుక అమల్లోకి వచ్చిందా ఇక బ్యాటర్ల పని ఖతం అనే చెప్పాలి. ఎందుకంటే పిచ్​తో సంబంధం లేకుండా తమ బలాన్ని నమ్ముకొని బౌలింగ్ చేసే జస్​ప్రీత్ బుమ్రా, పతిరానా, ట్రెంట్ బౌల్ట్, సునీల్ నరైన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లాంటి కొందరు డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. వీళ్లు ఏ పిచ్​ మీదనైనా వికెట్లు తీయడంలో సిద్ధహస్తులు. సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ఇలాంటి బౌలర్లకు ఆ కొత్త రూల్ బ్రహ్మాస్త్రంలా మారుతుంది. 5 ఓవర్లు వేసే అవకాశం వస్తే వీళ్లు మ్యాచ్ ఫలితాలను మార్చడం కాదు.. ఏకంగా శాసిస్తారని చెప్పొచ్చు. సాధారణంగా ఇలాంటి బౌలర్లను ఎదుర్కొని రన్స్ చేయడం కష్టం.. అలాంటిది వాళ్లు ఊపు మీద ఉన్నప్పుడు ఐదు ఓవర్లు వేసే ఛాన్స్ వస్తే ఏ టీమ్ అయినా తక్కువ స్కోర్లకే కుప్పకూలడం ఖాయం. అయితే ఈ రూల్ ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. మరి.. ఐపీఎల్​లో కొత్త రూల్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి