iDreamPost
android-app
ios-app

CSK vs GT మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్.. ఈ బుడ్డోడికి చెన్నై అంటే ఎంత ప్రేమో!

గుజరాత్ ఓపెనర్లు సెంచరీలతో సృష్టించిన విధ్వంసం చూసిన చెన్నై లిటిల్ ఫ్యాన్ ఏకంగా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అతడికి చెన్నైపై ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గుజరాత్ ఓపెనర్లు సెంచరీలతో సృష్టించిన విధ్వంసం చూసిన చెన్నై లిటిల్ ఫ్యాన్ ఏకంగా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అతడికి చెన్నైపై ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

CSK vs GT మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్.. ఈ బుడ్డోడికి చెన్నై అంటే ఎంత ప్రేమో!

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్. క్రికెట్ తెలిసిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు చెన్నైకి వీరాభిమానులు ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభం అయిన దగ్గర నుంచి చెన్నైకి ఫ్యాన్స్ పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ లిటిల్ చెన్నై ఫ్యాన్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్ ఓపెనర్లు సెంచరీలతో సృష్టించిన విధ్వంసం చూసిన చెన్నై లిటిల్ ఫ్యాన్ ఏకంగా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ కు అభిమానులు ఉంటారు. కానీ చెన్నైకి మాత్రం వీరాభిమానులు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఆ టీమ్ కు ఎంత పిచ్చి ఫ్యాన్స్ గా ఉంటారో చెప్పలేం కూడా. అలా చూపిస్తారు తమ ప్రేమను. తాజాగా మరోసారి చెన్నై ఫ్యాన్స్ అంటే ఈ ప్రపంచానికి తెలిసొచ్చేలా చేశాడు ఓ బుడ్డోడు. అసలేం జరిగిందంటే? నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లను ఊచకోతకోస్తూ.. ఓపెనర్లు సాయి సుదర్శన్(103), కెప్టెన్ శుబ్ మన్ గిల్(104) శతకాలతో చెలరేగారు.

సుదర్శన్-గిల్ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే. చెన్నై బౌలర్లను దంచికొట్టడం చూసిన ఓ లిటిల్ చెన్నై ఫ్యాన్ గుక్కపెట్టి ఏడ్చాడు. వారిద్దరు ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే చూడలేకపోయిన ఆ పిల్లాడు కన్నీరు పెట్టుకున్నాడు. తన తండ్రితో కలిసి మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఆ చిన్నారి తన బాధను తండ్రితో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పాపం పిల్లొడికి చెన్నై అంటే ఎంత ప్రేమో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై 35 రన్స్ తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మరి చెన్నై లిటిల్ ఫ్యాన్ కన్నీరు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి