iDreamPost
android-app
ios-app

Playoffs: గుజరాత్‌ విజయంతో మారిన ప్లే ఆఫ్‌ ఈక్వేషన్స్‌! రసవత్తరంగా పాయింట్స్‌ టేబుల్‌.. డేంజర్‌లో CSK?

  • Published May 11, 2024 | 11:31 AMUpdated May 11, 2024 | 11:31 AM

Playoffs, CSK vs GT, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్ ఏవో అనే ఆసక్తి క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. లీగ్‌ ముగింపు దశకు వచ్చినా.. ఇంకా ఏ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. అయితే.. గుజరాత్‌ విజయం తర్వాత.. ఏ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌ వెళ్లే ఛాన్స్‌ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Playoffs, CSK vs GT, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్ ఏవో అనే ఆసక్తి క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. లీగ్‌ ముగింపు దశకు వచ్చినా.. ఇంకా ఏ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. అయితే.. గుజరాత్‌ విజయం తర్వాత.. ఏ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌ వెళ్లే ఛాన్స్‌ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 11, 2024 | 11:31 AMUpdated May 11, 2024 | 11:31 AM
Playoffs: గుజరాత్‌ విజయంతో మారిన ప్లే ఆఫ్‌ ఈక్వేషన్స్‌! రసవత్తరంగా పాయింట్స్‌ టేబుల్‌.. డేంజర్‌లో CSK?

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు కొన్ని జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. సీజన్‌ ఆరంభంలో తడబడినా.. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే.. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ల్లో పెద్ద పెద్ద టీమ్స్‌ను కూడా లెక్కచేయకుండా ఓడిస్తున్నాయి. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ చిత్తుగా ఓడించింది. సీఎస్‌కే బౌలర్లను గుజరాత్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకుని.. తొలి వికెట్‌కు ఏకంగా 210 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ గెలవడంతో ప్లే ఆఫ్స్‌ ఈక్వేషన్స్‌ మరింత రసవత్తరంగా మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా 8 జట్లకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది.

ఉన్న నాలుగు బెర్తుల కోసం 8 జట్లు పోటీ పడుతున్నాయి. సీజన్‌ ముగింపు దశకు వచ్చినా.. ప్లే ఆఫ్స్‌కు ఒక్క టీమ్‌ కూడ అధికారికంగా వెళ్లలేదు. ముంబై ఇండియ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆయా జట్లు ఉన్న స్థానాలు వారి పాయింట్లు, అలాగే మిగిలి ఉన్న మ్యాచ్‌లు, వారి ప్రస్తుత ప్రదర్శన ఆధారంగా విశ్లేషించి.. ఏ ఏ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందో చూద్దాం.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఉన్నాయి. కేకేఆర్‌ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో నంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంది. అలాగే రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 16 పాయింట్లో రెండో స్థానంలో ఉంది. కేకేఆర్‌ కంటే కాస్త రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో రెండో ప్లేస్‌లో ఉంది.

ఇక మూడో స్థానంలో సన్‌రైజజర్స్‌ హైదరాబాద్‌ 14 పాయింట్లతో మూడో ప్లేస్‌లో, చెన్నై సూపర్‌ కింగ్స్‌ 12 పాయింట్లతో నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు టీమ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న కేకేఆర్‌, ఆర్‌ఆర్‌ టీమ్స​ ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం లాంఛనమే. ఎందుకంటే.. ఈ రెండు టీమ్స్‌కి మరో మూడేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా.. అధికారికంగా ఈ రెండు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి. ఈ రెండు టీమ్స్‌ ఉన్న ఫామ్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. ఇన్‌ప్యాక్ట్‌ ఒకటి కంటే ఎక్కువ విజయాలే సాధించి.. నంబర్‌ వన్‌, టూ స్థానాల్లోనే ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఇష్టపడతాయి. ఎందుకంటే.. ప్లే ఆఫ్స్‌లో క్వాలిఫైయర్‌-1లో ఓడినా.. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో క్వాలిఫైయర్‌-2 ఆడే అవకాశం.. పాయింట్ల పట్టికలో ఒకటీ రెండు స్థానాల్లో నిలిచి టీమ్స్‌కు ఉంటుంది.

ఈ అవకాశం వదులుకోవడానికి ఏ టీమ్స్‌కు కూడా ఇష్టపడవు. అందుకే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఈజీగా ఉన్నా.. కేకేఆర్‌, ఆర్‌ఆర్‌ మిగిలిన మ్యాచ్‌లను లైట్‌ తీసుకోకుండా చాలా సీరియస్‌గానే ఆడే అవకాశం కచ్చితంగా ఉంది. ఇకపోతే.. మిగిలిన రెండు స్థానాల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కేతో పాటు ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ, గుజరాత్‌ టీమ్స్‌ పోటీ పడుతున్నాయి. వీటిలో 14 పాయింట్లో పటిష్ట స్థితిలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కూడా ప్లే ఆఫ్స్‌ ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అవి కూడా గుజరాత్‌, పంజాబ్‌ టీమ్స్‌తో వీటిలో పంజాబ్‌ టీమ్‌ అంత మంచి ఫామ్‌లో లేదు. సో.. ఒక మ్యాచ్‌ గెలిచినా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం ఖాయం. ఇక ఒక్క స్థానం కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.

గుజరాత్‌పై ఓటమితో సీఎస్‌కే తమ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను డేంజర్‌లో పెట్టుకుంది. ఎందుకంటే.. సీఎస్‌కే తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌, ఆర్సీబీతో ఆడనుంది. రాజస్థాన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చు. ఆ టీమ్‌ టేబుల్‌ టాపర్‌ టూగా ఉంది. ఇక ఆర్సీబీ గత నాలుగు మ్యాచ్‌ల నుంచి గాయపడిన సింహంలా ఆడుతుంది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచిన తీరాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ మరింత టఫ్‌ ఆడటం ఖాయం. దీంతో సీఎస్‌కే ప్లేకు వెళ్లాంటే మిగిలి రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలిచి తీరాలి.. ఒక్క మ్యాచ్‌ ఓడినా.. వేరే టీమ్‌ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఢిల్లీ, లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రెండూ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి.

కాకుంటే ఈ రెండు టీమ్స్‌ ఒక్క టీమ్‌కే ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌ ఉంటుంది. ఎందుకంటే.. ఈ రెండు టీమ్స్‌ ఈ నెల 14న తలపడనున్నాయి. ఏదో ఒక్క టీమ్‌కే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచే అవకాశం ఉంది. ఈ రెండింటిలో వెళ్తే ఏదో ఒక్క టీమ్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. లేదా రెండు రెండు టీమ్స్‌ ఇంటికి వెళ్తాయి. ఇక ఆర్సీబీ, గుజరాత్‌ జట్లు.. మిగిలి రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి.. ఇతర టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడాలి. సీఎస్‌కే, ఢిల్లీ, లక్నో ఒక్కో మ్యాచ్‌ ఓడిపోతే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది. మొత్తంగా.. కేకేఆర్‌, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ నాలుగు టీమ్స్‌ ఫ్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి