iDreamPost
android-app
ios-app

IPL 2024: హార్దిక్​ను వదులుకున్న GTకి జాక్​పాట్.. ఆక్షన్​లో తక్కువ ధరకే ఆల్​రౌండర్!

  • Published Dec 19, 2023 | 5:05 PM Updated Updated Dec 19, 2023 | 5:05 PM

ప్లేయర్ల రిటెన్షన్​లో భాగంగా హార్దిక్ పాండ్యాను గుజరాత్ వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి ప్లేస్​ను ఎవరితో భర్తీ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కానీ పాండ్యాకు ధీటుగా ఆడే మరో ఆల్​రౌండర్​ను తక్కువ ధరకే వేలంలో దక్కించుకొని షాక్ ఇచ్చింది.

ప్లేయర్ల రిటెన్షన్​లో భాగంగా హార్దిక్ పాండ్యాను గుజరాత్ వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి ప్లేస్​ను ఎవరితో భర్తీ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కానీ పాండ్యాకు ధీటుగా ఆడే మరో ఆల్​రౌండర్​ను తక్కువ ధరకే వేలంలో దక్కించుకొని షాక్ ఇచ్చింది.

  • Published Dec 19, 2023 | 5:05 PMUpdated Dec 19, 2023 | 5:05 PM
IPL 2024: హార్దిక్​ను వదులుకున్న GTకి జాక్​పాట్.. ఆక్షన్​లో తక్కువ ధరకే ఆల్​రౌండర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న వేలంలో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడటంతో కొందరు అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయారు. అయితే ఈసారి ఆక్షన్​లో అందర్నీ ఆకర్షించిన మరో అంశం గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆ టీమ్ వదులుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ ప్రకియలో ముంబై ఇండియన్స్​కు హార్దిక్​ను ఇచ్చేసింది. దీని ద్వారా రూ.15 కోట్లతో పాటు అదనంగా మరికొంత మొత్తాన్ని గుజరాత్ పొందిందని వార్తలు వచ్చాయి. అయితే పాండ్యా వెళ్లిపోవడంతో అతడి స్థానాన్ని జీటీ ఎలా భర్తీ చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అందరికీ షాకిస్తూ రూ.50 లక్షలకే ఓ స్టార్ ఆల్​రౌండర్​ను దక్కించుకుంది గుజరాత్.

హార్దిక్ పాండ్యాను వదులుకున్న గుజరాత్.. కొత్త కెప్టెన్​గా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను నియమించిన సంగతి తెలిసింది. అయితే పాండ్యా ప్లేసులో వేలంలో ఎవర్నయినా స్టార్ ప్లేయర్​ను తీసుకుంటుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆఫ్ఘానిస్థాన్ ఆల్​రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయీని సొంతం చేసుకుంది. అతడ్ని యాభై లక్షలు మాత్రమే చెల్లించి దక్కించుకుంది. అయితే తక్కువ ధరకు అమ్ముడుపోయాడు కాబట్టి పెద్దగా పేరు లేని ప్లేయర్ అని పొరబడేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ తరపున ఎన్నో మ్యాచుల్లో అద్భుతంగా రాణించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అజ్మతుల్లా. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లోనూ ఈ ఆల్​రౌండర్ తన పెర్ఫార్మెన్స్​తో అందరి మనసులు దోచుకున్నాడు. మెగా టోర్నీలో బ్యాట్​తో పాటు బంతితోనూ చెలరేగాడు అజ్మతుల్లా.

ఓవరాల్​గా మెగా టోర్నీలో 353 రన్స్ చేసిన అజ్మతుల్లా ఒమర్జాయీ.. 7 వికెట్లు కూడా తీసి ఆఫ్ఘాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బౌండరీలతో పాటు భారీ సిక్సులు కొట్టడంలో అతడు ఎక్స్​పర్ట్. సరిగ్గా ఇదే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కోసం ఎదురు చూస్తున్న గుజరాత్.. వేలంలో బిడ్డింగ్​లోకి రాగానే అతడ్ని తీసేసుకుంది. గత కెప్టెన్ హార్దిక్ టీమ్​లో ఉన్నప్పుడు రెండు, మూడు ఓవర్లు బౌలింగ్ చేసేవాడు. అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూలు ఇచ్చేవాడు. అలాగే బ్యాటింగ్​లో అవసరాన్ని బట్టి థర్డ్, ఫోర్త్ డౌన్​లో దిగేవాడు. బిగ్ షాట్స్ కొడుతూ టీమ్​కు భారీ స్కోర్లు అందించేవాడు. ఇప్పుడు అలాంటి సత్తా ఉన్న అజ్మతుల్లా దొరకడంతో గుజరాత్ సంతోషంలో మునిగిపోయింది. రూ.15 కోట్ల పాండ్యా ప్లేసులో అవే క్వాలిటీస్ ఉన్న ఆఫ్ఘాన్ ఆల్​రౌండర్ రూ.50 లక్షలకే దక్కాడని మురిసిపోతోంది. మరి.. పాండ్యా లేని లోటును ఒమర్జాయీ భర్తీ చేస్తాడని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: భారత్ ఘోర ఓటమికి మూడేళ్లు.. అదే లేకపోతే కోట్లాది మందిని ఇన్​స్పైర్ చేసేది కాదు!