iDreamPost
android-app
ios-app

IPL 2022: Shubman Gill ఎలాన్ మస్క్ కు యువ క్రికెటర్ ట్వీట్.. స్విగ్గీ కౌంటర్

  • Published Apr 30, 2022 | 4:03 PM Updated Updated Apr 30, 2022 | 4:03 PM
IPL 2022: Shubman Gill ఎలాన్ మస్క్ కు యువ క్రికెటర్ ట్వీట్.. స్విగ్గీ కౌంటర్

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్ ని కొనుగోలు చేశారు. అప్పట్నుంచి ఎలాన్ మస్క్ హాట్ టాపిక్. సరదాగా కొంతమంది ఎలాన్ మస్క్ కి అది కొనేయండి, ఇది కొనేయండి అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. లేటెస్ట్ గా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ ట్వీట్, దానికి రిప్లై ఇప్పుడు వైరల్.

గిల్ చేసిన ట్వీట్ లో.. ఎలాన్‌ మస్క్‌.. దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి. అప్పుడు వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేయగలరు అంటూ పోస్ట్ చేసి, ఎలాన్ మస్క్(elon musk)ని ట్యాగ్ చేశాడు. దీనికి స్విగ్గీ రిప్లై ట్వీట్ చేసింది. శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ కి స్విగ్గీ ”హాయ్ శుభ్‌మన్ గిల్. మీరు ఆర్డర్ చేసి ఉంటే ఆ ఆర్డర్ డీటెయిల్స్ మాకు పంపించండి. మీ ఆర్డర్స్ త్వరగా వచ్చేలా చూస్తాం. ఇంకేమైనా సహాయం కావాలంటే మాకు మెసేజ్ చేయండి” అంటూ పోస్ట్ చేసింది.

ఓ స్విగ్గీ ఫేక్ అకౌంట్ నుంచి.. ”టీ20 క్రికెట్‌లో మీరు చేస్తోన్న బ్యాటింగ్‌ కంటే కూడా మేము చాలా వేగంగా ఉన్నాం” అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. ఈ కౌంటర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఏకంగా స్విగ్గీనే చేసిందని చాలామంది అనుకొంటున్నారు. మరికొంతమంది నెటిజన్లు.. ఒక రోజు డెలివరీ బాయ్‌గా పనిచేయండి, అప్పుడు వారి కష్టాలు మీకు అర్థమవుతాయి. మీ సంపాదనలో ఒక్క శాతం కూడా ఉండదు వారి సంపాదన, ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల, హోటల్ లేట్ గా ఇవ్వడం వల్ల, ఆర్డర్స్ లేట్ అవుతూ ఉంటాయి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.