క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్!

వన్డే ప్రపంచ కప్-2023  జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ నిర్ణయం ఏమిటంటే..

వన్డే ప్రపంచ కప్-2023  జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ నిర్ణయం ఏమిటంటే..

వన్డే  ప్రపంచ కప్-2023 తుది దశకు చేరుకుంది. ఆదివారం ఆహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు  గుజరాత్ కి వేలాది మంది సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఆహ్మదాబాద్  చేరుకున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. భారత్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వెళ్లే క్రికెట్ ఫ్యాన్స్ రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వన్డే ప్రపంచ కప్-2023  జరుగుతున్న నేపథ్యంలో అహ్మదాబాద్ కి మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను నడపుతున్నారు. అందులో మూడు ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడవనున్నాయి. అలానే మరొకటి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రైలు సర్వీసును నడపనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ నాలుగు రైళ్లు శనివారం సాయంత్రం ముంబై, ఢిల్లీ  ప్రాంతాల నుంచి బయలుదేరి  ఆదివారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుంటాయని పేర్కొంది.

అంతేకాక  అటుగా వెళ్లే అన్నీ సాధారణ రైలు రిజర్వేషన్‌లతో నిండినందున.. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు  చేసినట్లు తెలిపారు. విమాన, మిగతా రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.  అదే విధంగా ఈ ప్రత్యేక రైళ్ల ఛార్జీల వివరాలను కూడా రైల్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ. 620,  రూ.1,525కే 3ఏసీ ఎకానమీ బెర్త్, స్టాండర్డ్ 3ఏసీ రూ.1,665, ఫస్ట్ క్లాస్ ఏసీ రూ.3,490గా నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. కాగా అహ్మాదాబాద్‌కు ప్రస్తుతం విమాన టికెట్‌ ధర రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఉంది.

ఆధరలతో పోల్చితే.. ఈ స్పెషల్ ట్రైన్స్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. అలానే మ్యాచ్ ముగిసిన అనంతరం తిరిగి అభిమానులు ప్రత్యేక రైళ్లలో వెళ్లే సదుపాయం కూడా కల్పిస్తుంది. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైళ్లు బయల్దేరనున్నాయని భారతీయ రైల్వే శాఖ. ఈ స్పెషన్ ట్రైన్ రైళ్లలో టిక్కెట్లను ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని తెలిపింది. శనివారం జరిగే వన్డే వర్డల్ కప్ ఫైన్ మ్యాచ్ ను తిలకించేందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోని  క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీంతో  అహ్మదాబాద్‌ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. బసచేసే హోటళ్లు, తినే ఆహారం రేట్లు అన్నీ వేలు, లక్షల్లో పలుకుతున్నాయి. అహ్మదాబాద్ లో అసాధారణ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న క్రికెట్‌ అభిమానులకు రైల్వే ప్రకటించిన సదుపాయం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారిందని  పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మరి.. క్రికెట్ అభిమానుల కోసం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments