SNP
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియాతో పాటు.. జట్టులోని కొంతమంది ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు అతను టీమ్‌లో వేస్ట్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అతనెవరో? నిజంగా వేస్టా అనేది ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియాతో పాటు.. జట్టులోని కొంతమంది ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు అతను టీమ్‌లో వేస్ట్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అతనెవరో? నిజంగా వేస్టా అనేది ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం సగటు భారత క్రికెట్ అభిమానిని తీవ్రంగా నిరాశపర్చింది. మూడో రోజు వరకు ఇంగ్లండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. అనూహ్యంగా మ్యాచ్‌పై పట్టు జారవిడుస్తూ వచ్చింది. ఇంగ్లండ్ యువ క్రికెటర్ ఓలీ పోప్.. ఒక్కడే టీమిండియాకి-విజయానికి అడ్డుగోడలా నిలిచి.. మనకు విజయాన్ని దూరం చేశాడు. ప్రత్యర్థి బాగా ఆడటంతో పాటు.. జట్టులోని కొంతమంది ఆటగాళ్ల చెత్త ఆట కూడా ఓటమికి కారణమని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌పై భారత్ క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
జట్టులో గిల్‌ను వేస్ట్‌గా ఆడిస్తున్నారని, అతను వన్డేలే తప్ప టెస్ట్, టీ20 క్రికెట్‌కు పనికిరాడని మండిపడుతున్నారు. ఎంతో కీలకమైన వన్‌డౌన్‌లో దాదాపు 10 ఇన్నింగ్స్‌లుగా ఫామ్‌లో లేని ఆటగాడిని ఎలా ఆడిస్తారని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీమ్‌లో లేనప్పుడు.. పుజారా, రహానె లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లను తీసుకోకుండా.. రజత్ పటీదార్ లాంటి యువ క్రికెటర్‌ను తీసుకుని, అతన్ని బెంచ్‌పై కూర్చోబెట్టారు. ఫామ్‌లో లేని గిల్‌ను మూడో ప్లేస్‌లో ఆడించారు. అది టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. గిల్ తాను ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఈ 11 ఇన్నింగ్స్‌ల్లో అతనికి ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.
గిల్ ఆడిన చివరి 11 టెస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లను ఒక సారి గమనిస్తే.. 13, 18, 6, 10, 29, 2, 26, 36, 10, 23, 0.. ఇలా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కాదు కాదా.. కనీసం 40 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో తొల టెస్టులో అతను చేసిన పరుగులు కేవలం 23 మాత్రమే. అది కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేశాడు. ఎంతో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి.. టీమ్ మొత్తానిపై ఒత్తిడి పెంచాడు. ఇలా జట్టుకు గిల్ భారంగా మారుతున్నాడు. మరో కోహ్లీ అవుతాడు అనుకుంటే.. బ్యాడ్ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. అసలు అతనిలో ఏ మాత్రం కాన్పిడెన్స్ కనించడం లేదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి గిల్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill’s Test average drops below 30 after playing nearly 40 innings. pic.twitter.com/gqJ91NyHJg
— CricTracker (@Cricketracker) January 28, 2024