Nidhan
Women's T20 World Cup 2024: భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోర్డు డెసిషన్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Women's T20 World Cup 2024: భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోర్డు డెసిషన్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Nidhan
క్రికెట్లో దైపాక్షిక సిరీస్‌లు ఎన్ని నిర్వహించినా రాని పేరు, గుర్తింపు, ఆదాయం.. ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌తో వస్తుంది. టూరిస్టుల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌తో పాటు టికెట్ సేల్స్ తదితర రూపంలో భారీ మొత్తంలోనే ఆదాయం సమకూరుతుంది. అందుకే ఐసీసీ టోర్నీల నిర్వహణ కోసం అన్ని క్రికెటింగ్ నేషన్స్ పోటీపడతాయి. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం పోటీపడకుండానే ఓ మెగా ఈవెంట్ నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుంది. వరల్డ్ కప్‌ను నిర్వహించమంటూ భారత్‌కు ఛాన్స్ వచ్చింది. కానీ అందుకు బీసీసీఐ ససేమిరా నో చెప్పింది. ప్రపంచ కప్ లాంటి బడా టోర్నీ నిర్వహణ అవకాశం వస్తే ఎవరూ కాదనుకోరు. కానీ మన బోర్డు మాత్రం దీనికి నో చెప్పింది. దీంతో ఎందుకిలా చేస్తోందని అంతా ఆలోచనల్లో పడ్డారు.
విమెన్స్ టీ20 వరల్డ్ కప్-2024 టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. సెప్టెంబర్ నుంచి ఈ టోర్నీ మొదలవ్వాల్సి ఉంది. కానీ ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో పొట్టి కప్పు నిర్వహణ సందిగ్ధంలో పడింది. తమ దేశంలో సిచ్యువేషన్ బాగోకపోవడంతో మహిళల ప్రపంచ కప్‌ను భారత్‌లో నిర్వహించమంటూ బీసీసీఐని బంగ్లా బోర్డు కోరింది. కానీ మెగా టోర్నీ ఆతిథ్యానికి భారత బోర్డు నో చెప్పిందని తెలుస్తోంది. బంగ్లా బోర్డు రిక్వెస్ట్‌ను బీసీసీఐ సెక్రెటరీ జైషా తిరస్కరించారని సమాచారం. వచ్చే సీజన్లో డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు టీమిండియా సిరీస్‌లు కూడా ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్ కూడా ఇక్కడే జరగనుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని బంగ్లా ఆఫర్‌కు జైషా నో చెప్పారని వినిపిస్తోంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌తో పాటు విమెన్స్ వన్డే ప్రపంచ కప్ కూడా ఇక్కడే నిర్వహిస్తే బ్యాక్ టు బ్యాక్ రెండు మెగా టోర్నీలు భారత్‌లోనే జరిగాయనే అపవాదు వస్తుందనేది బీసీసీఐ ఆలోచనట. అలాగే నెక్స్ట్ దులీప్ ట్రోఫీ, బంగ్లాదేశ్ సిరీస్.. ఇలా ఎడతెరపిలేని క్రికెట్ ఉంది కాబట్టి మధ్యలో వరల్డ్ కప్ అంటే తీవ్ర ఒత్తిడి పడుతుందనే ఉద్దేశంతోనూ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బీసీసీఐ నో చెప్పిన నేపథ్యంలో విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ఎవరు ఆతిథ్యం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఐసీసీ.. మెగా టోర్నీ నిర్వహణ కోసం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. మరి.. వరడ్డ్ కప్ నిర్వహణకు బీసీసీఐ నో చెప్పడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jay Shah confirms the BCCI has refused to host the 2024 women’s T20 World Cup in India. (TOI). pic.twitter.com/saANxJ3YE3
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024