iDreamPost
android-app
ios-app

Duleep Trophy 2024: ఆ స్టార్ ప్లేయర్ ను పట్టించుకోని BCCI.. యంగ్ క్రికెటర్స్ కంటే దారుణంగా! కెరీర్ ఖతమేనా?

  • Published Aug 15, 2024 | 11:36 AM Updated Updated Aug 15, 2024 | 11:36 AM

తొలి రౌండ్ లో  దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగే జట్లను బీసీసీఐ ప్రకటించింది. అందులో ఓ స్టార్ క్రికెటర్ కు చోటు దక్కలేదు. దాంతో అతడి కెరీర్ ఖతమేనా? అన్న అనుమానాలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తొలి రౌండ్ లో  దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగే జట్లను బీసీసీఐ ప్రకటించింది. అందులో ఓ స్టార్ క్రికెటర్ కు చోటు దక్కలేదు. దాంతో అతడి కెరీర్ ఖతమేనా? అన్న అనుమానాలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Duleep Trophy 2024: ఆ స్టార్ ప్లేయర్ ను పట్టించుకోని BCCI.. యంగ్ క్రికెటర్స్ కంటే దారుణంగా! కెరీర్ ఖతమేనా?

టీమిండియాలో ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెటర్లు ఉన్నారు. అదీకాక ఐపీఎల్ పుణ్యమాని మరికొంత మంది టాలెంటెడ్ ప్లేయర్లు రాకెట్ వేగంతో జాతీయ జట్టులోకి దూసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్ లో లేకపోవడంతో.. బీసీసీఐ వారిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. తాజాగా తొలి రౌండ్ లో  దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగే జట్లను బీసీసీఐ ప్రకటించింది. అందులో ఓ స్టార్ క్రికెటర్ కు చోటు దక్కలేదు. దాంతో అతడి కెరీర్ ఖతమేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి రౌండ్ లో బరిలోకి దిగే నాలుగు జట్లను ప్రకటించింది బీసీసీఐ. ఈ నాలుగు టీమ్స్ లో కూడా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కలేదు. దాంతో మరోసారి అతడికి అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ లో రెండు వన్డేల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ.. రెండు మ్యాచ్ ల్లో కూడా డకౌట్ కావడంతో.. అతడిని దులీప్ ట్రోఫీకి సెలెక్టర్లు పరిగణంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో రెడ్ బాల్ క్రికెట్ కు శాంసన్ ను మేనేజ్ మెంట్ దూరం పెడుతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కొందరు క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్న సంజూను డొమెస్టిక్ క్రికెట్ లో కూడా పట్టించుకోకపోవడంతో.. అతడి కెరీర్ ముగింపు దశకు వచ్చిందా? అన్న సందేహాలు ఫ్యాన్స్ ను ఆందోళన పరుస్తున్నాయి.

sanju samson carrier

ఇదిలా ఉండగా.. శాంసన్ తో పాటుగా రింకూ, పృథ్వీ షాలకు కూడా ఈ ట్రోఫీలో చోటు దక్కలేదు. అదీకాక రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వకపోవడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. బీసీసీఐ ప్రకటించిన నాలుగు జట్లకు కెప్టెన్లుగా శుబ్ మన్ గిల్, అభిమన్యు ఈశ్వరణ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌ లను నియమించింది. ఈ ట్రోఫీలో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, పరాగ్, జూరెల్ లాంటి యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చి.. సంజూ శాంసన్ ను మాత్రం పట్టించుకోలేదు బీసీసీఐ. దాంతో సంజూకు మరోసారి అన్యాయం జరిగిందని వాపోతున్నారు ఫ్యాన్స్. మరి దులీప్ ట్రోఫీలో సంజూకు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.