Nidhan
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
Nidhan
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కొన్న అతడు 13 పరుగులు చేశాడు. గతంలో క్రికెట్లో ఒకే బంతికి పదమూడు కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికి ఎవరూ అన్ని పరుగులు చేయలేదు. ఆ విధంగా వరల్డ్ క్రికెట్లో ఇన్నింగ్స్ మొదటి బంతికి 13 రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు.
ఆతిథ్య జట్టు కెప్టెన్ సికిందర్ రజా వేసిన ఆ ఓవర్లో తొలి బంతి ఫుల్‌టాస్ పడగా దాన్ని స్లాగ్ స్వీప్‌తో ఆన్ సైడ్ బలంగా బాదాడు జైస్వాల్. దానికి 6 పరుగులు వచ్చాయి. అయితే దాన్ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. రజా బౌలింగ్ వేసే టైమ్‌లో లైన్ దాటడంతో అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ స్టంప్‌కు దూరంగా ఫుల్ లెంగ్త్ డెలివరీతో కట్టడి చేద్దామని ప్రయత్నించాడు. కానీ నిల్చున్న చోట నుంచే బౌలర్ తల మీదుగా దాన్ని స్టాండ్స్‌లోకి పంపించాడు జైస్వాల్. దీంతో మొదటి బంతికే ఏకంగా 13 పరుగులు వచ్చాయి. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రస్తుతం 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులతో ఉంది. సంజూ శాంసన్ (40 నాటౌట్), రియాన్ పరాగ్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. జైస్వాల్ అరుదైన ఘనతపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024