iDreamPost
android-app
ios-app

Irfan Pathan: వీడియో: పఠాన్ మైండ్​బ్లోయింగ్ డెలివరీ.. బిత్తరపోయిన యూనిస్ ఖాన్!

  • Published Jul 14, 2024 | 2:19 PMUpdated Jul 14, 2024 | 2:19 PM

భారత్ మరో కప్పును గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్​లో పాకిస్థాన్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్​లో ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చెలరేగిపోయాడు.

భారత్ మరో కప్పును గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్​లో పాకిస్థాన్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్​లో ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చెలరేగిపోయాడు.

  • Published Jul 14, 2024 | 2:19 PMUpdated Jul 14, 2024 | 2:19 PM
Irfan Pathan: వీడియో: పఠాన్ మైండ్​బ్లోయింగ్ డెలివరీ.. బిత్తరపోయిన యూనిస్ ఖాన్!

భారత్ మరో కప్పును గెలచుకుంది. వరల్డ్ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్​లో పాకిస్థాన్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. బర్మింగ్​హామ్ వేదికగా జరిగిన శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో పాక్​ను చిత్తు చేసింది యువీ సేన. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన దాయాది జట్టు ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రమాన్ అక్మల్ (24), షోయబ్ మాలిక్ (41) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లు ఫర్వాలేదనిపించినా వేగంగా పరుగులు చేయలేకపోవడంతో మోస్తరు లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది. అనంతరం ఛేజింగ్​ మొదలుపెట్టిన మెన్ ఇన్ బ్లూ ఇంకో 5 బంతులు ఉండగానే మ్యాచ్​ను ముగించేసింది.

మన జట్టు బ్యాటర్లలో ఓపెనర్ అంబటి రాయుడు (30 బంతుల్లో 50), గురుకీరత్ సింగ్ మాన్ (34), యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 30) రాణించారు. ముఖ్యంగా రాయుడు, పఠాన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారీ షాట్లతో పాక్ బౌలర్లను చీల్చి చెండాడారు. వీళ్లు ఔటైనా కెప్టెన్ యువరాజ్ సింగ్ (15 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో హైలైట్ అంటే ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ అనే చెప్పాలి. టోర్నీలో ఎక్కువగా బ్యాటింగ్​తో రచ్చ చేసిన పఠాన్.. నిన్నటి మ్యాచ్​లో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. పాక్ సారథి యూనిస్ ఖాన్​ను అతడు మైండ్​బ్లోయింగ్ డెలివరీతో ఔట్ చేశాడు.

పాక్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసేందుకు వచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. అప్పటికే 11 బంతుల్లో ఏడు పరుగులు చేసిన యూనిస్ ఖాన్.. మ్యాచ్ లాస్ట్ వరకు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాడు. తాను చివరి వరకు ఉంటే భారీ స్కోరు సాధించొచ్చని అనుకున్నాడు. అయితే పఠాన్ స్టన్నింగ్ డెలివరీకి అతడు పెవిలియన్ బాట పట్టాడు. ఆ ఓవర్ మూడో బంతిని గుడ్​ లెంగ్త్​లో వేశాడు ఇర్ఫాన్. అయితే లైన్​ను కంప్లీట్​గా మిస్ అయిన యూనిస్ దాన్ని లెగ్ సైడ్ షాట్​గా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ లైన్ మిస్ అవ్వడం, అతడి బ్యాట్​కు, ప్యాడ్​కు మధ్య భారీ గ్యాప్ ఉండటంతో అందులో నుంచి దూరి వికెట్లను గిరాటేసింది బాల్. క్లీన్​బౌల్డ్ కావడంతో యూనిస్ అసహనంగా క్రీజును వీడాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇర్ఫాన్​లో ఇంకా పస తగ్గలేదని.. అదే జోరు అని మెచ్చుకుంటున్నారు. మరి.. పఠాన్ మ్యాజికల్ డెలివరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి