iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. T20 క్రికెట్​ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jul 14, 2024 | 6:53 PM Updated Updated Jul 14, 2024 | 6:53 PM

టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్​గా నిలిచాడు.

టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్​గా నిలిచాడు.

  • Published Jul 14, 2024 | 6:53 PMUpdated Jul 14, 2024 | 6:53 PM
Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. T20 క్రికెట్​ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బ్యాటర్​గా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్​లో జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కొన్న అతడు 13 పరుగులు చేశాడు. గతంలో క్రికెట్​లో ఒకే బంతికి పదమూడు కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికి ఎవరూ అన్ని పరుగులు చేయలేదు. ఆ విధంగా వరల్డ్ క్రికెట్​లో ఇన్నింగ్స్ మొదటి బంతికి 13 రన్స్ చేసిన తొలి బ్యాటర్​గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు.

ఆతిథ్య జట్టు కెప్టెన్ సికిందర్ రజా వేసిన ఆ ఓవర్​లో తొలి బంతి ఫుల్​టాస్ పడగా దాన్ని స్లాగ్ స్వీప్​తో ఆన్ సైడ్ బలంగా బాదాడు జైస్వాల్. దానికి 6 పరుగులు వచ్చాయి. అయితే దాన్ని అంపైర్ నోబాల్​గా ప్రకటించాడు. రజా బౌలింగ్ వేసే టైమ్​లో లైన్ దాటడంతో అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ స్టంప్​కు దూరంగా ఫుల్ లెంగ్త్​ డెలివరీతో కట్టడి చేద్దామని ప్రయత్నించాడు. కానీ నిల్చున్న చోట నుంచే బౌలర్ తల మీదుగా దాన్ని స్టాండ్స్​లోకి పంపించాడు జైస్వాల్. దీంతో మొదటి బంతికే ఏకంగా 13 పరుగులు వచ్చాయి. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్ ప్రస్తుతం 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులతో ఉంది. సంజూ శాంసన్ (40 నాటౌట్), రియాన్ పరాగ్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. జైస్వాల్ అరుదైన ఘనతపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.