ఆ ఇద్దరు లెజెండ్స్​ను గుర్తుచేసిన జైస్వాల్-గిల్.. ఇక, భారత్ ఫ్యూచర్​కు ఢోకా లేదు!

Yashasvi Jaiswal-Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్-శుబ్​మన్ గిల్ చెలరేగిపోయారు. జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో వీళ్లిద్దరూ పెను విధ్వంసం సృష్టించారు.

Yashasvi Jaiswal-Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్-శుబ్​మన్ గిల్ చెలరేగిపోయారు. జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో వీళ్లిద్దరూ పెను విధ్వంసం సృష్టించారు.

క్రికెట్​లో ఏ జట్టుకైనా భారీగా పరుగులు చేయాలంటే సూపర్బ్ బ్యాటర్స్ కావాలి. అందునా స్టార్టింగ్ నుంచి చెలరేగి రన్స్ చేసే మంచి ఓపెనర్స్ కావాలి. ఓపెనర్స్ బలంగా ఉన్న టీమ్స్​కు ఢోకా ఉండదని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. టీమిండియాకు కూడా గతంలో సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్ రూపంలో సాలిడ్ ఓపెనర్స్ ఉండేవారు. ఆ తర్వాత శిఖర్ ధవన్-రోహిత్ శర్మ కూడా ఆ పొజిషన్లలో ఆడి అదరగొట్టారు. హిట్​మ్యాన్ ఇంకా అదే విధంగా ఆడుతున్నాడు. ఈ తరుణంలో మన జట్టుకు మరో అద్భుతమైన ఓపెనింగ్ జోడీ దొరికింది. టీమిండియా యంగ్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్-శుబ్​మన్ గిల్ చెలరేగిపోయారు. జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో వీళ్లిద్దరూ పెను విధ్వంసం సృష్టించారు.

నాలుగో టీ20లో జింబాబ్వే సంధించిన 152 పరుగుల టార్గెట్​ను టీమిండియా 15.2 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజింగ్ కంప్లీట్ చేసింది. ఓపెనర్లు జైస్వాల్, గిల్ తొలి వికెట్​కు అజేయంగా 156 పరుగులు జోడించారు. 53 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 13 బౌండరీలు, 2 భారీ సిక్సుల సాయంతో 93 పరుగులు చేశాడు. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో కలిపి 58 పరుగులు చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే ప్రత్యర్థి బౌలర్లను దంచుడు మొదలుపెట్టిన ఈ క్రేజీ జోడీ.. మ్యాచ్ ముగిసేవరకు వాళ్లను వదల్లేదు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా ఎవరు బౌలింగ్​కు వచ్చినా ఉతికి ఆరేశారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో జింబాబ్వే బౌలర్లు ఏం చేయాలో పాలుపోక గుడ్లు తేలేశారు.

ఈ మ్యాచ్​తో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీని గుర్తుచేశారు జైస్వాల్-గిల్. ఫస్ట్ బాల్ నుంచే దాడికి దిగడం, వచ్చిన బాల్​ను వచ్చినట్లు స్టేడియంలోకి పంపడం రోహిత్ శైలి. అదే కోహ్లీ అయితే యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోతాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్యలో బౌండరీలు కొడుతూ పోతాడు. అవసరమైతే గేర్లు మార్చి భారీ షాట్లకు దిగుతాడు. ఇవాళ జైస్వాల్-గిల్ కూడా అచ్చం అదే విధంగా బ్యాటింగ్ చేశారు. జైస్వాల్ పిచ్చ కొట్టుడు కొడితే.. గిల్ కాస్త నింపాదిగా ఆడుతూ, మధ్యలో షాట్స్​కు వెళ్లాడు. రోకో జోడీనే కాదు.. లెజెండ్స్ గంగూలీ, సచిన్​ను కూడా ఈ యంగ్​స్టర్స్ గుర్తుచేశారు. అప్పట్లో సచిన్, దాదాల్లో ఎవరో ఒకరు లీడ్ తీసుకొని విధ్వంసం సృష్టిస్తే.. మరొకరు యాంకర్ రోల్ పోషించేవారు. ఇవాళ ఈ యువకులు ఆడిన తీరును చూసిన నెటిజన్స్.. టీమిండియా ఫ్యూచర్​కు ఢోకా లేదని అంటున్నారు. మరి.. జైస్వాల్-గిల్ ఆడిన తీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments