Nidhan
టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తాను బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తోపేనని మరోమారు ప్రూవ్ చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టీ20లో మ్యాజికల్ రనౌట్‌తో మెరిశాడతను.
టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తాను బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తోపేనని మరోమారు ప్రూవ్ చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టీ20లో మ్యాజికల్ రనౌట్‌తో మెరిశాడతను.
Nidhan
టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తాను బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తోపేనని మరోమారు ప్రూవ్ చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టీ20లో మ్యాజికల్ రనౌట్‌తో మెరిశాడతను. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ టైమ్‌లో 15వ ఓవర్ వేసేందుకు వచ్చాడు బిష్ణోయ్. ఆ ఓవర్ 5వ బంతిని లెగ్ సైడ్ వైపు పుష్ చేశాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. అయితే బాల్ ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో సింగిల్ తీయాలా? వద్దా? అనే విషయంలో రజాకు నాన్‌స్ట్రయికర్ క్యాంప్‌బెల్‌కు మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడింది. రజా రన్ కోసం వచ్చినట్లే వచ్చి బాల్ కోసం బిష్ణోయ్ వేగంగా పరిగెత్తడం చూసి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన క్యాంప్‌బెల్ తిరిగి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌ను చేరుకునేందుకు ప్రయత్నించాడు.
క్యాంప్‌బెల్ తిరిగి వచ్చేలోపే బంతిని అందుకున్న బిష్ణోయ్ బుల్లెట్ త్రో వేసి వికెట్లను గిరాటేశాడు. దీంతో జింబాబ్వే బ్యాటర్ బిత్తరపోయాడు. గత మ్యాచ్‌లో పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్బ్ క్యాచ్ అందుకున్న బిష్ణోయ్.. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన రనౌట్‌తో అలరించాడు. అతడు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుస్తుండటంతో టీమ్ మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంది. బిష్ణోయ్ ఫీల్డింగ్‌ను చూసిన నెటిజన్స్ అతడ్ని టీమిండియా జాంటీ రోడ్స్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. బౌలర్ల నుంచి ఈ రేంజ్లో ఫీల్డింగ్ ఎఫర్ట్‌ను ఎవరూ ఎక్స్పెక్టే చేయలేరని.. అతడు మ్యాజిక్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. మరి.. బిష్ణోయ్ మ్యాజికల్ రనౌట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Believe it or not Ravi Bishnoi is a modern day Jonty Rhodes.
In fact Jonty is outdated,Bishnoi is a better version of him.He takes brilliant catches, can do bullet throws and bowling is just outstanding. Unbelievable talent.pic.twitter.com/poeyeLJaQJ
— Sujeet Suman (@sujeetsuman1991) July 13, 2024