iDreamPost
android-app
ios-app

Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ తప్పు చేశారా? దేశం పరువు పోతే బాధ్యత ఎవరిది?

  • Published Jul 06, 2024 | 7:42 PM Updated Updated Jul 06, 2024 | 7:42 PM

India vs Zimbabwe: సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్​తో వీళ్లు పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశారు.

India vs Zimbabwe: సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్​తో వీళ్లు పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశారు.

  • Published Jul 06, 2024 | 7:42 PMUpdated Jul 06, 2024 | 7:42 PM
Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ తప్పు చేశారా? దేశం పరువు పోతే బాధ్యత ఎవరిది?

టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్​తో వీళ్లు పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశారు. ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా కొనసాగడానికి వాళ్లు నిరాకరించారు. ఇక మీదట వన్డేలు, టెస్టుల మీదే ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్ ఎలాగూ ఉంది. కాబట్టి ఆ రెండు ట్రోఫీలు నెగ్గి కెరీర్​ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నారు. తాము పక్కకు జరగడం వల్ల టాలెంటెడ్ యంగ్​స్టర్స్​కు టీమ్​లో ఛాన్స్ దొరుకుతుందని రిటైర్మెంట్ టైమ్​లో కోహ్లీ చెప్పాడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే విరాట్-రోహిత్ తప్పు చేశారని అనిపించకమానదు.

టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్​కు పయనమైంది యంగ్ ఇండియా. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన ఈ టీమ్​ను శుబ్​మన్ గిల్ కెప్టెన్​గా ముందుండి లీడ్ చేస్తున్నాడు. అతడితో పాటు ఐపీఎల్ సంచలనం అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధృవ్ జురెల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లతో నిండిన టీమ్ జింబాబ్వేకు వెళ్లింది. అయితే మొదటి టీ20లోనే మన టీమ్​కు షాక్ తగిలింది. తొలి మ్యాచ్​లో ఆతిథ్య జట్టును మన బౌలర్లు 115 పరుగులకే కట్టడి చేశారు. ఇక మ్యాచ్​ మనదేనని అంతా అనుకున్నారు. కానీ భారత బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మన జట్టు ప్రస్తుతం 12 ఓవర్లలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

జింబాబ్వే దెబ్బకు మన టీమ్ బ్యాటర్స్ అంతా పెవిలియన్​కు క్యూ కట్టారు. ఒక్క గిల్ (31) తప్పితే ఇంకెవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. అభిషేక్, రింకూ డకౌట్ అయ్యారు. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే మ్యాచ్​లో భారత్ ఓడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ రోహిత్-కోహ్లీని తప్పుబడుతున్నారు. నిన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలిచామని అందరమూ సంబురపడ్డాం.. ఇప్పుడు జింబాబ్వే చేతిలో ఓడితే దేశం పరువు పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేని ఈ యంగ్​స్టర్స్ కోసమా రోకో జోడీ త్యాగాలు చేసిందని అంటున్నారు. జింబాబ్వే లాంటి పసికూన చేతిలో ఓడితే కప్ గెలిచి కూడా పరువు నిలబడదు కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్-కోహ్లీ ఈజీగా ఇంకో రెండేళ్లు ఆడొచ్చని.. వాళ్లు టీమ్​లో ఉంటూ యంగ్​స్టర్స్​ను గైడ్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి.. రిటైర్మెంట్ ప్రకటించి రోహిత్-కోహ్లీ తప్పు చేశారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.