Yashasvi Jaiswal: జైస్వాల్ థండర్ ఇన్నింగ్స్.. లంక బౌలర్ల బెండు తీశాడు!

India vs Sri Lanka: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోమారు తన విశ్వరూపం చూపించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.

India vs Sri Lanka: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోమారు తన విశ్వరూపం చూపించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.

టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోమారు తన విశ్వరూపం చూపించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లోనే 40 పరుగులు బాదాడు. ఉన్నంత సేపు లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన జైస్వాల్.. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. దంచుడే దంచుడు అన్నట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది.

ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన జైస్వాల్.. 5 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు బాదాడు. 190 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తూ పవర్​ప్లేలో టీమ్ స్కోరు 70 పరుగులు దాటేలా చేశాడు. అతడికి మరో ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ మంచి సపోర్ట్ అందించాడు. 16 బంతుల్లోనే 34 పరుగులతో అలరించాడు గిల్. వరుస బౌండరీలతో లంక శిబిరంలో కల్లోలం రేపాడు. మొత్తంగా 6 ఫోర్లు, ఓ సిక్స్ బాదాడతను. వీళ్లిద్దరూ కలసి మొదటి వికెట్​కు 5.6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. మరి.. జైస్వాల్-గిల్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments