iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: సూర్య కాదు.. అసలు కెప్టెన్ అతడే! అంతా ప్లాన్ ప్రకారమే: కివీస్ లెజెండ్

  • Published Jul 27, 2024 | 5:25 PMUpdated Jul 27, 2024 | 5:25 PM

టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్​గా మారాక అతడికి ఇదే తొలి అసైన్​మెంట్ కానుంది.

టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్​గా మారాక అతడికి ఇదే తొలి అసైన్​మెంట్ కానుంది.

  • Published Jul 27, 2024 | 5:25 PMUpdated Jul 27, 2024 | 5:25 PM
Suryakumar Yadav: సూర్య కాదు.. అసలు కెప్టెన్ అతడే! అంతా ప్లాన్ ప్రకారమే: కివీస్ లెజెండ్

టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్​గా మారాక అతడికి ఇదే తొలి అసైన్​మెంట్ కానుంది. ఇవాళ శ్రీలంకతో మొదలయ్యే టీ20 సిరీస్​తో సారథ్య పగ్గాలు చేపడుతున్నాడు సూర్య. దీంతో అతడు చాలా ఎగ్జయిటెడ్​గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో టీ20 సిరీస్​ల్లో టీమ్​ను నడిపించాడు మిస్టర్ 360. కానీ పూర్తి స్థాయి కెప్టెన్​గా మారాక మాత్రం ఇదే ఫస్ట్ సిరీస్ కానుంది. కాబట్టి ఆ ప్రెజర్​తో పాటు టీ20 ఛాంపియన్స్​గా భారత్ బరిలోకి దిగుతుండటం కూడా స్కైకి అదనపు ఒత్తిడిగా మారిందని చెప్పొచ్చు. టీమ్ విన్నింగ్ స్ట్రీక్​ను మెయింటెయిన్ చేయడంతో పాటు బ్యాటర్​గా కూడా అతడు రాణించాల్సి ఉంటుంది. అదే టైమ్​లో ఇతర ఆటగాళ్ల నుంచి కూడా బెస్ట్​ను రాబట్టుకోవాలి.

ఫస్ట్ సిరీస్​కు ముందు ఎన్నో సవాళ్లు సూర్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే కొత్త కోచ్ గౌతం గంభీర్ రూపంలో అతడికి కొండంత అండ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్​ నుంచైనా టీమ్​ను బయటపడేయడానికి గౌతీ సలహాలు, సూచనలు అతడికి ఉపయోగపడతాయి. అలాగే వైస్ కెప్టెన్ రూపంలో యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ సపోర్ట్ కూడా సూర్యకు ఉంది. వీళ్ల అండతో అతడు సిరీస్​ను క్లీన్​స్వీప్ చేస్తే అదిరిపోతుంది. ఫస్ట్ అసైన్​మెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లే. ఈ సందర్భంగా న్యూజిలాండ్ లెజెండ్ స్కాట్ స్టైరిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సూర్య సక్సెస్ అవుతాడనే నమ్మకం తనకు ఉందన్న స్టైరిస్.. అసలు కెప్టెన్ మాత్రం అతడు కాదన్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్నాడు.

సూర్యకుమార్​ కాదు.. శుబ్​మన్ గిలే అసలు కెప్టెన్ అన్నాడు స్టైరిస్. సూర్య షార్ట్ టర్మ్ కెప్టెన్​ అని.. కొన్నాళ్ల తర్వాత అతడు ఆ బాధ్యతల నుంచి దిగక తప్పదని ఈ న్యూజిలాండ్ దిగ్గజం చెప్పాడు. వైస్ కెప్టెన్ గిల్​ను కొన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి సారథిగా నియమిస్తారని తెలిపాడు. సూర్య సపోర్ట్​తో కెప్టెన్సీని అర్థం చేసుకోవడం, జట్టును ముందుండి నడిపించడం లాంటి విషయాలను గిల్​ నేర్చుకునే పనిలో ఉన్నాడని స్టైరిస్ పేర్కొన్నాడు. ‘సూర్య ఏడాది లేదా రెండేళ్ల వరకే కెప్టెన్సీలో ఉంటాడు. గిల్​ను కెప్టెన్ చేయడానికి అవసరమయ్యే ఓ బ్రిడ్జిలా అతడ్ని ఉపయోగిస్తున్నారు. అతడు టెంపరరీ కెప్టెన్. గిల్​కు అనుభవం వచ్చే వరకు మాత్రమే అతడు ఈ రోల్​లో ఉంటాడు’ అని స్టైరిస్ స్పష్టం చేశాడు. మరి.. సూర్య కాదు.. గిల్ అసలు కెప్టెన్ అంటూ స్టైరిస్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి