శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్‌ను విరాట్ కోహ్లీ బ్యాట్‌తో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ కొట్టాక మాథ్యూస్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్‌ను విరాట్ కోహ్లీ బ్యాట్‌తో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ కొట్టాక మాథ్యూస్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుసగా ఏడో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. వన్డే క్రికెట్లో రన్స్ పరంగా భారత్‌కిది నాలుగో అదిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 357 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 రన్స్‌కే కుప్పకూలింది. ఆ టీమ్‌లో కాసున్ రజిత (14) టాప్ స్కోరర్. ఏంజెలో మాథ్యూస్ (12), తీక్షణ (12) పరుగులు చేశారు.
రజిత, మాథ్యూస్, తీక్షణను మినహాయిస్తే మిగిలిన లంక బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు 3 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడించారు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో లంక బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. పాథుమ్ నిశాంక, దిముత్ కరుణరత్నె, దుషాన్ హేమంతలు ఆడిన తొలి బాల్కే వెనుదిరిగారు. సదీర సమరవిక్రమ, దుష్మంత చమీర కూడా గోల్డెన్ డక్ అయ్యారు.
టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ (4) ఈసారి ఫెయిలయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 88) మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (92 బంతుల్లో 92)తో కలసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీళ్లిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లో 82) కూడా రాణించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఏకంగా 6 సిక్సర్లు బాదాడు. చివర్లో జడేజా (35) కూడా రాణించడంతో టీమ్ భారీ స్కోరు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ టైమ్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఒక పని వైరల్ అవుతోంది.
ఫీల్డ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే కోహ్లీ లంక సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ఆటపట్టించాడు. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌ను లెగ్‌సైడ్ ఆడాడు కోహ్లీ. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లిన కోహ్లీ.. తన చేతిలో ఉన్న బ్యాట్‌తో మాథ్యూస్‌ను వెనుక నుంచి కొట్టాడు. దీంతో మాథ్యూస్ నవ్వాపుకోలేకపోయాడు. మాథ్యూస్‌ను కోహ్లీ బ్యాట్‌తో కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే మ్యాచ్‌లో గిల్‌ను కూడా సరదాగా కొట్టాడు కోహ్లీ. మరి.. తోటి క్రికెటర్స్‌ను కోహ్లీ ఆటపట్టించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన అయ్యర్! అతియా శెట్టి రియాక్షన్ చూడండి
kohli with Gill and mathews 😹 pic.twitter.com/QBu0H7lKdI
— Ꮶᴀʟʏᴀɴ ×͜× (@IamKalyanRaksha) November 2, 2023
Lmao why kohli pic.twitter.com/q49iFn3Owt
— mon (@4sacinom) November 2, 2023