iDreamPost
android-app
ios-app

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఔటైన అయ్యర్‌! అతియా శెట్టి రియాక్షన్‌ చూడండి

  • Author singhj Published - 09:18 PM, Thu - 2 November 23

శ్రీలంకతో మ్యాచ్​లో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మెరుపు ఇన్నింగ్స్​తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ఔటైన టైమ్​లో అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్​గా మారింది.

శ్రీలంకతో మ్యాచ్​లో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మెరుపు ఇన్నింగ్స్​తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ఔటైన టైమ్​లో అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్​గా మారింది.

  • Author singhj Published - 09:18 PM, Thu - 2 November 23
మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఔటైన అయ్యర్‌! అతియా శెట్టి రియాక్షన్‌ చూడండి

టీమిండియా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఏంటో మరోమారు తెలిసొచ్చింది. వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. మొదట బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో ఏకంగా 357 రన్స్ చేసింది. శుబ్​మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయస్ అయ్యర్ (82) సూపర్బ్‌ నాక్స్​తో టీమ్​కు భారీ స్కోరును అందించారు. ఈ ముగ్గురు బ్యాటర్లు దురదృష్టం కొద్దీ సెంచరీలు చేయలేకపోయారు. కానీ ఉన్నంత సేపు తమ అద్భుత బ్యాటింగ్​తో అలరించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కానీ గిల్​తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. గిల్, కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (21) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సూర్యకుమార్ యాదవ్ (12) కూడా ఆకట్టుకోలేకపోయాడు. కానీ శ్రేయస్ అయ్యర్ (82), రవీంద్ర జడేజా (35) తమ బ్యాట్ పవర్ ఏంటో చూపించారు. ముఖ్యంగా అయ్యర్ అయితే వరుసగా సిక్సులు బాదాడు. అతడి ఇన్నింగ్స్​లో ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అయ్యర్ హిట్టింగ్ ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

శ్రేయస్ అయ్యర్ ఔటైనా జడేజా ఆఖరి వరకు క్రీజులో ఉండి టీమ్ భారీ స్కోరును చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఔటై వెళ్తున్న టైమ్​లో స్టేడియంలో ఉన్న కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైర​ల్ అవుతోంది. అయ్యో అంటూ రెండు చేతుల్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది అతియా. అయ్యర్ ఔట్​కు అతియా ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అతియా రియాక్షన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler