iDreamPost
android-app
ios-app

Shubman Gill: గిల్​లో ఊహించని మార్పు.. ఈ పని ముందే చేస్తే వరల్డ్ కప్​లో ఆడించేవాళ్లు!

  • Published Jul 28, 2024 | 2:14 PMUpdated Jul 28, 2024 | 2:14 PM

టీమిండియా యంగ్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ లంకతో జరిగిన తొలి టీ20లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అతడిలో ఊహించని మార్పు కనిపించింది.

టీమిండియా యంగ్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ లంకతో జరిగిన తొలి టీ20లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అతడిలో ఊహించని మార్పు కనిపించింది.

  • Published Jul 28, 2024 | 2:14 PMUpdated Jul 28, 2024 | 2:14 PM
Shubman Gill: గిల్​లో ఊహించని మార్పు.. ఈ పని ముందే చేస్తే వరల్డ్ కప్​లో ఆడించేవాళ్లు!

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ గురించి తెలిసిందే. ఇన్నింగ్స్​ను నిదానంగా స్టార్ట్ చేసే గిల్.. క్రీజులో నిలదొక్కుకున్నాక షాట్లు ఆడటం మొదలుపెడతాడు. స్లోగా స్టార్ట్ చేసినా ఆ తర్వాత పుంజుకొని ఆడుతుంటాడు. కింగ్ కోహ్లీ మాదిరిగా యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడటం గిల్​కు అలవాటు. విరాట్ రేంజ్​కు చేరుకోకపోయినా అతడి దారిలో నడుస్తూ ఫ్యూచర్​పై ఆశలు పెంచుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతుండటంతో బోర్డు అతడికి వైస్ కెప్టెన్​గా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీ20లు, వన్డేల్లో కొత్త బాధ్యతలు దక్కడంతో గిల్ ఇక మీదట ఎలా ఆడతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎప్పటిలాగే యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడని ఊహిస్తే.. అతడు తన గేమ్​ను పూర్తిగా మార్చేశాడు.

వైస్ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ మ్యాచ్​లో గిల్ బ్యాటింగ్​లో ఊహించని మార్పు వచ్చింది. శ్రీలంకతో నిన్న జరిగిన తొలి టీ20లో ఓపెనర్​గా బరిలోకి దిగిన ఈ యంగ్ బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు. 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 6 బౌండరీలు, ఒక సిక్సుతో లంక బౌలర్లకు పోయించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఉతుకుడే అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది. ఎక్కువగా నిదానంగా ఆడే గిల్.. ఈ మ్యాచ్​లో మాత్రం 212 స్ట్రయిక్ రేట్​తో బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ పూనినట్లు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడి బ్యాటింగ్ చూసి అంతా షాకవుతున్నారు. కొత్త కోచ్ గంభీర్ రాకతో గిల్ ఆడే తీరు మారిపోయిందని.. ఇక మీదట కూడా దీన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. ఈ పని ముందు చేస్తే టీ20 వరల్డ్ కప్​లో ప్లేయింగ్ ఎలెవన్​లో ఆడించేవాళ్లు కదా అని అంటున్నారు.

వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్​గా ఉన్న గిల్​ను టెస్ట్ ఫార్మాట్​కు కూడా వైస్ కెప్టెన్​గా చేయాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడని వినిపిస్తోంది. అయితే స్లో బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ కారణంగా అతడిపై విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. గిల్ మెళ్లిగా ఆడతాడని, అతడి వల్ల రుతురాజ్ లాంటి ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గిల్​ను రోహిత్ మాదిరిగా అటాకింగ్ అప్రోచ్​తో గౌతీ ఆడించాడని తెలుస్తోంది. టీమ్​లో అతడి ప్లేస్​ను, వైస్ కెప్టెన్సీ రోల్​ను ఎవరూ క్వశ్చన్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దూకుడే మంత్రంగా క్రీజులో కదలాలని సూచించాడని.. అందుకే నిన్న గిల్ అలా రెచ్చిపోయాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది టీమిండియాకు మంచిదేనని.. గిల్ సక్సెస్​కు గంభీర్​కు క్రెడిట్ ఇవ్వాలని నెటిజన్స్ అంటున్నారు. మరి.. గిల్ గేమ్​లో మార్పు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి