iDreamPost
android-app
ios-app

గిల్‌ బ్యాటింగ్‌కు సచిన్‌ కూతురు సారా ఫిదా! నిల్చొని మరీ..

  • Author singhj Published - 08:25 PM, Thu - 2 November 23

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ అదరగొట్టాడు. వరల్డ్ కప్​లో భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్న గిల్.. ఈ మ్యాచ్​తో దాన్ని పూర్తి చేశాడు.

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ అదరగొట్టాడు. వరల్డ్ కప్​లో భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్న గిల్.. ఈ మ్యాచ్​తో దాన్ని పూర్తి చేశాడు.

  • Author singhj Published - 08:25 PM, Thu - 2 November 23
గిల్‌ బ్యాటింగ్‌కు సచిన్‌ కూతురు సారా ఫిదా! నిల్చొని మరీ..

వన్డే ప్రపంచ కప్​-2023లో టీమిండియా మరో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత్ అదరగొడుతోంది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 357 రన్స్ చేసింది. యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ (92)తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (88), శ్రేయస్ అయ్యర్ (82) రాణించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (35) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి లంక ముందు భారీ టార్గెట్​ను ఉంచడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో దిల్షాన్ మదుశంక 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.

సెంచరీ దిశగా దూసుకెళ్తున్న గిల్, కోహ్లీ, అయ్యర్​ను మదుశంక వెనక్కి పంపాడు. భారత ఇన్నింగ్స్​లో గిల్-కోహ్లీ పార్ట్​నర్​షిప్ సూపర్బ్ అనే చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ (4) త్వరగా ఔటవ్వడంతో టీమిండియా కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ గిల్​తో కలసి కోహ్లీ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరూ క్రీజులో సెటిలయ్యాక బౌండరీల వర్షం కురిపించారు. గిల్ రెండు భారీ సిక్సులతో అలరించాడు. సెంచరీ చేస్తాడనుకుంటే రాంగ్ షాట్ ఆడి ఔటయ్యాడు. అయితే గిల్ బ్యాటింగ్​కు ఫిదా అయింది లెజెండ్ సచిన్ టెండ్కూలర్ కూతురు సారా.

మదుశంక బౌలింగ్​లో శుబ్​మన్ గిల్ ఔటై వెళ్తున్న టైమ్​లో సారా టెండూల్కర్ నిల్చొని మరీ చప్పట్లు కొట్టింది. మంచి ఇన్నింగ్స్ ఆడావంటూ సారా ప్రోత్సహించడం కెమెరా కంటికి చిక్కింది. గిల్​ను సారా ఎంకరేజ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ గిల్​పై తనకు ఉన్న ప్రేమను మరోమారు సారా ఎక్స్​ప్రెస్ చేసిందని అంటున్నారు. తమ మధ్య ఉన్న లవ్​ను కన్ఫర్మ్ చేసిందని చెబుతున్నారు. మరి.. గిల్ కోసం సారా నిలబడి మరీ ప్రోత్సహించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ముగ్గురి సెంచరీలు మిస్‌! బౌలింగ్‌ బాగుందా? మనోళ్లదే తప్పా?