Nidhan
India vs Sri Lanka: వన్డే సిరీస్‌లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేలోనూ ఆ టీమ్ ఇలాగే ఆడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
India vs Sri Lanka: వన్డే సిరీస్‌లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేలోనూ ఆ టీమ్ ఇలాగే ఆడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
Nidhan
శ్రీలంక జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు. ఆ టీమ్ ఉనికి కాపాడుకుంటే అదే గొప్ప అని భావించారు. దీనికి కారణం ఇటీవల కాలంలో ఎదుర్కొన్న ఘోర ఓటములే. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ చిత్తుగా ఓటమి పాలవడమే. అయితే యువకులతో కూడిన ఆ జట్టు గివప్ ఇవ్వడం లేదు. తమ ఆటతీరుతోనే అందరికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బాగా ఆడి అందరి ప్రశంసలు అందుకుంది. వన్డే సిరీస్‌లో రెచ్చిపోయి ఆడుతూ 1-0తో లీడింగ్‌లోకి వచ్చింది. సిరీస్ గెలిచినా, సమమైనా ఆ టీమ్ పోరాడుతున్న తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు. లంక నుంచి ఇంత ప్రతిఘటనను ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ ఆసాంతం పోరాడుతూ టీమిండియా లాంటి టాప్ టీమ్‌ను భయపెట్టడం అంటే మాటలు కాదు.
వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్‌లో లంక గెలిచింది. ఇదే జోరులో మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను కొట్టేయాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. మరోవైపు కసిగా ఉన్న రోహిత్ సేన.. ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాలని అనుకుంటోంది. అందులో భాగంగానే కొత్త కోచ్ గంభీర్-కెప్టెన్ రోహిత్ శర్మ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తోంది. టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయాలి? లంకను ఎలా ఆపాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారట. రెండు వన్డేల్లోనూ బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్ వ్యూహాన్ని ఛేదించలేక చతికిలపడింది. అందుకే మూడో వన్డేలో ఆ పిచ్చోడ్ని దించాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట.
సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాలని రోహిత్-గంభీర్ నిర్ణయించుకున్నారట. పిచ్ ఎలా బిహేవ్ చేస్తోంది? బౌలర్లు ఎవరు? లాంటి విషయాలను పట్టించుకోకుండా క్రీజులోకి వచ్చింది తడవు వెరైటీ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత్ అవసరం టీమ్‌కు ఉందని కెప్టెన్-కోచ్ భావిస్తున్నారట. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంత్ లాంటోడు టీమ్‌లో ఉండాల్సిందేనని అనుకుంటున్నారట. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాలన్నా, అపోజిషన్ బౌలర్లను నిలదొక్కుకోకుండా చూడాలన్నా అతడి వల్లే సాధ్యమని డిసైడ్ అయ్యారట. శివమ్ దూబె లేదా కేఎల్ రాహుల్ ప్లేస్‌లో పంత్‌ను దింపాలని రోహిత్ ఫిక్స్ అయ్యాడని సమాచారం. ఒకవేళ పంత్ టీమ్‌లోకి వస్తే బ్యాటింగ్ బలం పెరుగుతుంది. అతడు 30 నుంచి 40 బంతులు ఆడితే మ్యాచ్ టర్న్ అవుతుంది. మరి.. పంత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.