iDreamPost
android-app
ios-app

Rohit Sharma: లంక చేతిలో ఎదురుదెబ్బలకు స్వయంకృతమే కారణమా? రోహిత్ మేల్కొనకపోతే కష్టమే!

  • Published Aug 05, 2024 | 8:40 PM Updated Updated Aug 05, 2024 | 8:40 PM

శ్రీలంకతో వన్డే సిరీస్​లో భారత్​కు బ్యాక్ టు బ్యాక్ షాకులు తగులుతున్నాయి. రోహిత్ సేన గెలవాల్సిన తొలి వన్డేను లంక పోరాడి టై చేసింది. రెండో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇచ్చి నెగ్గింది.

శ్రీలంకతో వన్డే సిరీస్​లో భారత్​కు బ్యాక్ టు బ్యాక్ షాకులు తగులుతున్నాయి. రోహిత్ సేన గెలవాల్సిన తొలి వన్డేను లంక పోరాడి టై చేసింది. రెండో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇచ్చి నెగ్గింది.

  • Published Aug 05, 2024 | 8:40 PMUpdated Aug 05, 2024 | 8:40 PM
Rohit Sharma: లంక చేతిలో ఎదురుదెబ్బలకు స్వయంకృతమే కారణమా? రోహిత్ మేల్కొనకపోతే కష్టమే!

శ్రీలంకతో వన్డే సిరీస్​లో భారత్​కు బ్యాక్ టు బ్యాక్ షాకులు తగులుతున్నాయి. రోహిత్ సేన గెలవాల్సిన తొలి వన్డేను లంక పోరాడి టై చేసింది. రెండో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇచ్చి నెగ్గింది. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన సెకండ్ మ్యాచ్​లో 32 పరుగుల తేడాతో గెలిచింది ఆతిథ్య జట్టు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీ20 సిరీస్​లో లంకను మూడు చెరువుల నీళ్లు తాగించిన టీమిండియా.. తీరా వన్డే సిరీస్​కు వచ్చే సరికి చేతులెత్తేసింది. ఈజీగా గెలవాల్సిన ఫస్ట్ మ్యాచ్​ను డ్రా చేసుకుంది. రెండో వన్డేలోనూ ఒక్క బ్యాటర్ నిలబడి ఆడినా నెగ్గేది. కానీ రోహిత్ (64), అక్షర్ (44) తప్ప అందరూ ఫెయిలవడంతో ఓటమి తప్పలేదు.

టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్లు రేంజ్​కు తగ్గట్లు ఆడట్లేదు. కెప్టెన్ రోహిత్ తప్పితే మిగతా బ్యాటర్లు ఎవరూ బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేయకపోవడం, లంక స్పిన్ ఉచ్చును ఛేదించలేకపోవడం బిగ్ మైనస్​గా మారింది. అయితే ఇవన్నీ కాదు.. ఆతిథ్య జట్టు చేతిలో మెన్ ఇన్ బ్లూకు వరుస షాక్​లు తగలడానికి స్వయంకృతమే కారణంగా ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. లంక టూర్ ఆరంభం నుంచి భారత్ కాస్త అలసత్వంతో ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రాక్టీస్​లో సీరియస్​గా కష్టపడినా.. గ్రౌండ్​లో దిగాక మాత్రం ఈజీగా గెలిచేస్తామనే ధోరణితో ఉన్నట్లే అనిపిస్తోంది.

Gambhir rohith

రోహిత్, దూబె, గిల్ లాంటి స్పెషలిస్ట్ బ్యాటర్లను బౌలింగ్​లో వాడుకోవడం.. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఆల్​రౌండర్లకు బ్యాటింగ్​లో ప్రమోషన్ ఇవ్వడం లాంటి ప్రయోగాలు చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా లంకను తక్కువ అంచనా వేయడం కొంప ముంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత గురించి వినే ఉంటారు. భారత్ కూడా లంకను అలాగే ట్రీట్​ చేస్తూ.. ఫ్యూచర్​ కోసం ఎక్స్​పెరిమెంట్స్ చేస్తూ పోతే ఇబ్బందేం లేదు. కానీ పసికూన రేంజ్​కు పడిపోయిన లంక వంటి టీమ్స్ చేతుల్లో ఓడుతూ ప్రయోగాలు చేస్తామంటే అటు ఆడియెన్స్, ఫ్యాన్స్ నుంచి ఇటు బోర్డు పెద్దల నుంచి కూడా సపోర్ట్ దొరికే ఛాన్స్ లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గెలుపు జోరు పడిపోకుండా చూసుకుంటూ ఎక్స్​పెరిమెంట్స్ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.