iDreamPost
android-app
ios-app

Rohit Sharma: లంకను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్! విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అతడు!

  • Published Aug 05, 2024 | 9:50 PM Updated Updated Aug 05, 2024 | 9:50 PM

India vs Sri Lanka: వన్డే సిరీస్​లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేలోనూ ఆ టీమ్ ఇలాగే ఆడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

India vs Sri Lanka: వన్డే సిరీస్​లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేలోనూ ఆ టీమ్ ఇలాగే ఆడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

  • Published Aug 05, 2024 | 9:50 PMUpdated Aug 05, 2024 | 9:50 PM
Rohit Sharma: లంకను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్! విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అతడు!

శ్రీలంక జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు. ఆ టీమ్ ఉనికి కాపాడుకుంటే అదే గొప్ప అని భావించారు. దీనికి కారణం ఇటీవల కాలంలో ఎదుర్కొన్న ఘోర ఓటములే. వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్​లోనూ చిత్తుగా ఓటమి పాలవడమే. అయితే యువకులతో కూడిన ఆ జట్టు గివప్ ఇవ్వడం లేదు. తమ ఆటతీరుతోనే అందరికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే భారత్​తో జరిగిన టీ20 సిరీస్​లో బాగా ఆడి అందరి ప్రశంసలు అందుకుంది. వన్డే సిరీస్​లో రెచ్చిపోయి ఆడుతూ 1-0తో లీడింగ్​లోకి వచ్చింది. సిరీస్ గెలిచినా, సమమైనా ఆ టీమ్​ పోరాడుతున్న తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు. లంక నుంచి ఇంత ప్రతిఘటనను ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ ఆసాంతం పోరాడుతూ టీమిండియా లాంటి టాప్ టీమ్​ను భయపెట్టడం అంటే మాటలు కాదు.

వన్డే సిరీస్​లో మొదటి మ్యాచ్​ టై కాగా.. రెండో మ్యాచ్​లో లంక గెలిచింది. ఇదే జోరులో మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్​ను కొట్టేయాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. మరోవైపు కసిగా ఉన్న రోహిత్ సేన.. ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్​ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముకుతాడు వేయాలని అనుకుంటోంది. అందులో భాగంగానే కొత్త కోచ్ గంభీర్-కెప్టెన్ రోహిత్ శర్మ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తోంది. టీమ్​లో ఎలాంటి మార్పులు చేయాలి? లంకను ఎలా ఆపాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారట. రెండు వన్డేల్లోనూ బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్ వ్యూహాన్ని ఛేదించలేక చతికిలపడింది. అందుకే మూడో వన్డేలో ఆ పిచ్చోడ్ని దించాలని హిట్​మ్యాన్​ భావిస్తున్నాడట.

Ind vs SL

సిరీస్ డిసైడర్ మ్యాచ్​లో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్​ను బరిలోకి దింపాలని రోహిత్-గంభీర్ నిర్ణయించుకున్నారట. పిచ్ ఎలా బిహేవ్ చేస్తోంది? బౌలర్లు ఎవరు? లాంటి విషయాలను పట్టించుకోకుండా క్రీజులోకి వచ్చింది తడవు వెరైటీ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత్ అవసరం టీమ్​కు ఉందని కెప్టెన్-కోచ్ భావిస్తున్నారట. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంత్​ లాంటోడు టీమ్​లో ఉండాల్సిందేనని అనుకుంటున్నారట. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్​ను నిలబెట్టాలన్నా, అపోజిషన్ బౌలర్లను నిలదొక్కుకోకుండా చూడాలన్నా అతడి వల్లే సాధ్యమని డిసైడ్ అయ్యారట. శివమ్ దూబె లేదా కేఎల్ రాహుల్ ప్లేస్​లో పంత్​ను దింపాలని రోహిత్ ఫిక్స్ అయ్యాడని సమాచారం. ఒకవేళ పంత్ టీమ్​లోకి వస్తే బ్యాటింగ్ బలం పెరుగుతుంది. అతడు 30 నుంచి 40 బంతులు ఆడితే మ్యాచ్ టర్న్ అవుతుంది. మరి.. పంత్ ప్లేయింగ్ ఎలెవన్​లో ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.