Nidhan
IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది శ్రీలంక. దారుణమైన ఆటతీరుతో వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన సింహళ జట్టు.. భారత్ మీద గెలిచి తీరాలని చూస్తోంది.
IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది శ్రీలంక. దారుణమైన ఆటతీరుతో వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన సింహళ జట్టు.. భారత్ మీద గెలిచి తీరాలని చూస్తోంది.
Nidhan
శ్రీలంక.. ఒకప్పుడు ఈ టీమ్ పేరు చెబితే అన్ని జట్లు వణికేవి. మోస్ట్ డేంజరస్ టీమ్‌గా చాలా ఏళ్ల పాటు క్రికెట్ వరల్డ్‌లో హవా నడిపించింది లంక. కప్పులు గెలిచినా గెలవకపోయినా బౌలింగ్, బ్యాటింగ్‌లో డామినేషన్ చూపిస్తూ అవతలి జట్లను భయపెట్టడం ఆ కంట్రీ స్టైల్. ఎందరో గ్రేట్ ప్లేయర్లను ప్రొడ్యూస్ చేసిన లంక ఇప్పుడు పసికూన స్టేజ్‌కు పడిపోయింది. ఆ టీమ్‌తో మ్యాచ్ అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు. జయవర్దనే, సంగక్కర లాంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత లంక ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లోనూ చెత్తాటతో గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది. అలాంటి జట్టు ఇప్పుడు టీమిండియాతో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.
చెత్తాట కారణంగా సొంత అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న లంక.. భారత్ మీద గెలిచి తీరాలని చూస్తోంది. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. టెంపరరీ కోచ్ జయసూర్య అండతో మెన్ ఇన్ బ్లూను పడగొట్టాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో నెగ్గి పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ లేరు కాబట్టి యంగ్ ఇండియాను ఓడించగలమనే ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లంక్ స్టార్ పేసర్ దుష్మంత చమీర భారత సిరీస్ నుంచి వైదొలిగాడని తెలిసింది.
గాయం కారణంగా చమీర ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడని లంక క్రికెట్ వర్గాల సమాచారం. అయితే ఆ టీమ్ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ చమీర ఆడటం సాధ్యం కాదని.. అతడి స్థానంలో ఇంకొకర్ని తీసుకోవడం ఖాయమని వినిపిస్తోంది. చమీర స్థానంలో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను రీప్లేస్ ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే లంక క్రికెట్ బోర్డు నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. అసలే దారుణంగా ఆడుతూ విమర్శల పాలవుతున్న లంక టీమ్ ఈ సిరీస్‌తోనైనా గాడిలో పడాలని చూస్తోంది. కనీసం భారత్‌కు ఫైట్ బ్యాక్ ఇవ్వాలని కసిగా ఉంది. ఈ సమయలో స్టార్ పేసర్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ లోటును అధిగమించి సింహళ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.
Dushmantha Chameera ruled out from India Tour.
Replacement will be announced#sportspavilionlk #SLvsIND
— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) July 24, 2024