SNP
Gautam Gambhir, Hardik Pandya, IND vs SL: టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మరి గంభీర్ అంతలా పాండ్యాకు స్పెషల్ క్లాసులు తీసుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, Hardik Pandya, IND vs SL: టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మరి గంభీర్ అంతలా పాండ్యాకు స్పెషల్ క్లాసులు తీసుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
భారీ అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు గౌతమ్ గంభీర్. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిపించిన.. టీమిండియా గంభీర్ చేతుల్లో పెట్టాడు రాహుల్ ద్రవిడ్. ఆల్రెడీ ఛాంపియన్ అయిన టీమ్‌ను నెక్ట్స లెవెల్‌కు తీసుకెళ్లాలి. అందుకే గంభీర్‌పై పెద్ద బాధ్యత ఉంది. తనపై ఉన్న ఎక్స్‌పెట్టేషన్స్‌ను అందుకునేందుకు గంభీర్ సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హెడ్ కోచ్‌గా తొలి ప్రాక్టీస్ సెషన్ నుంచే తన మార్క్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా లంకకు వెళ్లింది. హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన తర్వాత ఈ నెల 22న తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. ఆ సమావేశం తర్వాత యంగ్ టీమిండియాతో కలిసి లంకకు వెళ్లాడు. మంగళవారం నాడే తొలి ప్రాక్టీస్ సెషన్ కూడా నిర్వహించాడు. ఆ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై గంభీర్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. పాండ్యాతో ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయించి.. అతనికి ముఖ్యమైన సూచనలు చేశాడు.
హార్ధిక్ పాండ్యా సైతం గౌతమ్ గంభీర్‌తో చాలా టైమ్‌స్పెండ్ చేశాడు. తన బ్యాటింగ్ టెక్నిక్, బౌలింగ్ గురించి హెడ్ కోచ్‌తో చాలా సేపు మాట్లాడాడు. అయితే.. గౌతమ్ గంభీర్, పాండ్యాపై అంత ఫోకస్ ఎందుకు పెడుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ప్రస్తుతం శ్రీలంక టూర్‌కు వెళ్లిన జట్టులో ఎక్కువగా యంగ్ క్రికెటర్లే ఉన్నారు. వారికి పెద్దగా అనుభవం లేదు. టీమ్‌లో ఉన్న మోస్ట్ సీనియర్ క్రికెటర్ పాండ్యానే. హెడ్ కోచ్‌గా గంభీర్ తన తొలి సిరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించాలంటే పాండ్యా రాణించడం ఎంతో అవసరం. ఒక ఆల్‌రౌండర్‌గా పాండ్యా.. టీ20 వరల్డ్ కప్‌లో చూపించిన ప్రదర్శనను లంకలో రిపీట్ చేస్తే సిరీస్ విజయం సులువే. అందుకే పాండ్యాపై గంభీర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hardik Pandya with Head Coach Gautam Gambhir in the practice session. 🇮🇳 pic.twitter.com/PvFy1tt4hZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2024