iDreamPost
android-app
ios-app

Virat Kohli: సౌతాఫ్రికాతో సెకండ్ టెస్ట్.. రాముడిలా కోహ్లీ.. బాణం ఎక్కుపెడుతూ..!

  • Published Jan 03, 2024 | 5:36 PM Updated Updated Jan 03, 2024 | 5:36 PM

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​లో టీమిండియా చెలరేగి ఆడుతోంది. అయితే ప్రొటీస్ ఇన్నింగ్స్ టైమ్​లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ విషయం హైలైట్​గా నిలిచింది.

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​లో టీమిండియా చెలరేగి ఆడుతోంది. అయితే ప్రొటీస్ ఇన్నింగ్స్ టైమ్​లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ విషయం హైలైట్​గా నిలిచింది.

  • Published Jan 03, 2024 | 5:36 PMUpdated Jan 03, 2024 | 5:36 PM
Virat Kohli: సౌతాఫ్రికాతో సెకండ్ టెస్ట్.. రాముడిలా కోహ్లీ.. బాణం ఎక్కుపెడుతూ..!

సౌతాఫ్రికాతో మొదటి టెస్ట్​లో ఘోర ఓటమితో ఒక్కసారిగా టీమిండియాపై భారీగా విమర్శలు వచ్చిపడ్డాయి. టీమ్​లో అంతమంది స్టార్లు ఉన్నా ఇన్నింగ్స్ తేడాతో ఓడటం ఏంటనే కామెంట్స్ వినిపించాయి. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవాల్సిన టైమ్ వచ్చేసిందనే డిమాండ్లూ వచ్చాయి. దీంతో రెండో టెస్ట్​లో భారత్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ కేప్​టౌన్​లో జరుగుతున్న చివరి మ్యాచ్​లో రోహిత్ సేన చెలరేగిపోయింది. పేస్, స్వింగ్​కు సహకరిస్తున్న పిచ్ మీద సౌతాఫ్రికా కెప్టెన్ టాస్ నెగ్గి అనూహ్యంగా బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం తప్పని తేలేందుకు ఎంతో టైమ్ పట్టలేదు. ఆతిథ్య జట్టు 55 రన్స్​కు కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ రాముడిలా బాణం ఎక్కుపెట్టడం హైలైట్​గా నిలిచింది.

సౌతాఫ్రికా స్పిన్ ఆల్​రౌండర్ కేశవ్ మహారాజ్ గురించి తెలిసిందే. భారత మూలాలున్న ఈ స్టార్ క్రికెటర్​ ఆంజనేయ స్వామికి వీరభక్తుడు. అందుకే అతడు బ్యాటింగ్​కు వచ్చిన ప్రతిసారి ‘ఆదిపురుష్’లోని ‘రామ్ సీతా రామ్’ అనే పాటను ప్లే చేస్తుంటారు. భారత్​తో రెండో టెస్ట్ సందర్భంగా కూడా ఆ పాటను ప్లే చేశాడు డీజే. అయితే అప్పటికే ప్రొటీస్ టపటపా వికెట్లు కోల్పోతుండటంతో ఫుల్ జోష్​లో కనిపించిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆ పాటకు రాముడిలా పోజిచ్చాడు. శ్రీరాముడి మాదిరిగా చేతులతో బాణాన్ని ఎక్కుపెడుతూ కనిపించాడు. అలాగే రాముడికి నమస్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాట పెట్టింది కేశవ్ మహారాజ్ కోసమైతే కోహ్లీ మాత్రం తన కోసమే ప్లే చేశారన్నట్లుగా ఎంజాయ్ చేస్తూ, పోజులు ఇస్తూ కనిపించాడు.

kohli as rama

శ్రీరాముడికి నమస్కరిస్తూ, చేతిలో బాణం లేకున్నా ఆయనలా ఎక్కుపెట్టి కోహ్లీ పోజు ఇచ్చిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు విరాట్​కు భక్తి కూడా ఎక్కువేనని అంటున్నారు. రాములవారి ఆశీస్సులు కోహ్లీ మీద ఉండాలని.. ఈ సంవత్సరం కూడా అతడు మరింత చెలరేగి ఆడాలని కోరుకుంటున్నారు. ఇక, రెండో టెస్ట్​లో భారత పేసర్ల దెబ్బకు సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో ప్రొటీస్ వెన్ను విరిచాడు. జస్​ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టి సిరాజ్ మియాకు మంచి సహకారం అందించారు. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. 23.2 ఓవర్లకే ఆతిథ్య టీమ్​ చాప చుట్టేసింది. తొలి టెస్ట్ ఓటమితో కసి మీద ఉన్న భారత్​కు ఇదే గోల్డెన్ ఛాన్స్. ఇదే ఊపులో బాగా బ్యాటింగ్ చేసి మూడ్రోజుల్లోనే మ్యాచ్​ను ఫినిష్ చేయాలి. మరి.. రాముడిలా మారి కోహ్లీ బాణాన్ని ఎక్కుపెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: ఆ విషయంలో కింగ్​ ఖాన్​ను దాటేసిన కింగ్ కోహ్లీ.. విరాట్ డామినేషన్ ఇది!