iDreamPost

Virat Kohli: ఆ విషయంలో కింగ్​ ఖాన్​ను దాటేసిన కింగ్ కోహ్లీ.. విరాట్ డామినేషన్ ఇది!

  • Published Jan 03, 2024 | 4:05 PMUpdated Jan 03, 2024 | 4:05 PM

బాలీవుడ్ కింగ్​ ఖాన్ షారుక్​ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఆ విషయంలో విరాట్ డామినేషన్​ ముందు షారుక్ నిలవలేకపోయాడు.

బాలీవుడ్ కింగ్​ ఖాన్ షారుక్​ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఆ విషయంలో విరాట్ డామినేషన్​ ముందు షారుక్ నిలవలేకపోయాడు.

  • Published Jan 03, 2024 | 4:05 PMUpdated Jan 03, 2024 | 4:05 PM
Virat Kohli: ఆ విషయంలో కింగ్​ ఖాన్​ను దాటేసిన కింగ్ కోహ్లీ.. విరాట్ డామినేషన్ ఇది!

మొదటి టెస్ట్​లో సౌతాఫ్రికా చేతిలో చావుదెబ్బ తిన్న టీమిండియా రెండో మ్యాచ్​కు రెడీ అవుతోంది. ఈసారి ఎలాగైనా ఆతిథ్య జట్టును చిత్తు చేయాలని వ్యూహాలు పన్నుతోంది. పేస్, బౌన్స్​కు సహకరించే పిచ్​ల మీద ప్రొటీస్ బౌలర్లను మరింత కాన్ఫిడెంట్​గా ఎదుర్కోవాలని చూస్తోంది. అందుకోసం నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ప్లేయర్లు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జోరుగా బ్యాటింగ్ సాధన చేస్తున్నారు. వెన్ను నొప్పి వల్ల తొలి మ్యాచ్​లో ఆడలేకపోయిన రవీంద్ర జడేజా కూడా ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. రెండో టెస్ట్​లో సౌతాఫ్రికా కొమ్ములు వంచాలని చూస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్​లో ఆఖరి వరకు పోరాటం చేసిన కోహ్లీ అదే ఫామ్​ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో కింగ్​ కోహ్లీకి అభిమానులకు మరింత జోష్​ను ఇచ్చే ఒక న్యూస్. ఓ విషయంలో బాలీవుడ్ కింగ్​ఖాన్ షారుక్​ను విరాట్ దాటేశాడు.

హ్యూజ్ ఫ్యాన్​బేస్ కలిగిన విరాట్ కోహ్లీ ఈసారి షారుక్ ఖాన్​కు షాకిచ్చాడు. 2023లో అత్యధిక వికీపీడియా పేజెస్​ వ్యూస్ కలిగిన ఆసియా సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు. ఎక్కువ మంది చూసిన వికీపీడియా పేజ్​ విరాట్​దే. అతడి వికీపీడియా పేజ్​ను ఏకంగా 10.7 మిలియన్ల మంది చూశారు. కింగ్ తర్వాతి స్థానంలో బాలీవుడ్​ బాద్​షా షారుక్ నిలిచాడు. ఈ హిందీ స్టార్ వికీపీడియా పేజీకి 7.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మోస్ట్ వ్యూడ్ వికీపీడియా పేజెస్ లిస్ట్​లో మూడో పొజిషన్​లో ఉన్నారు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (6.5 మిలియన్లు). బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు చాలా మందిని వెనక్కి నెట్టి మరీ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు కోహ్లీ. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్​లో హయ్యెస్ట్ స్కోరర్​గా నిలిచిన కింగ్.. మిగిలిన టోర్నమెంట్లలోనూ తన బ్యాట్​తో దుమ్మురేపాడు. దీంతో సోషల్ మీడియా, ఇంటర్నెట్​లో అతడే హాట్ టాపిక్ అయ్యాడు.

2023 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ఇయర్ అవార్డునూ కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. వరల్డ్​వైడ్​గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లు ఈ పురస్కారం కోసం పోటీపడ్డారు. అందులో పదహారు మంది నాకౌట్ రౌండ్​కు సెలక్ట్ అవగా.. మెయిన్ కాంపిటీషన్ ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి కోహ్లీకి మధ్యే జరిగింది. అయితే ఫైనల్ ఓటింగ్​లో మెస్సీకి 22 శాతం ఓట్లు రాగా.. విరాట్​కు ఏకంగా 78 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీన్ని బట్టే టీమిండియా సీనియర్ బ్యాటర్​కు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్​లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు గతేడాది మరికొన్ని ఘనతలు అందుకున్నాడు కోహ్లీ. ఇంటర్నెట్​లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆసియా ఖండపు వ్యక్తిగా నంబర్ వన్ ప్లేస్​లో నిలిచాడు కోహ్లీ. దీంతో 2023 మొత్తం విరాట్ డామినేషన్ నడిచిందని.. కొత్త ఏడాదీ కింగ్ రూల్ చేస్తాడని అతడి అభిమానులు అంటున్నారు. మరి.. కింగ్ ఖాన్ షారుక్​ను కోహ్లీ దాటేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: నా కష్టాలు ఇంకెవరికీ రాకూడదు. అందుకే రాజకీయాల్లోకి..: అంబటి రాయుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి