iDreamPost
android-app
ios-app

సెంచరీపై స్పందించిన కోహ్లీ.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మెసేజ్ రావడంతోనే అంటూ..!

  • Author singhj Published - 10:28 AM, Mon - 6 November 23

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్​లో కోహ్లీ-అయ్యర్ పార్ట్​నర్​షిప్ హైలైట్ అనే చెప్పాలి. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్​పై ఈ జోడీ ఆడిన తీరు సూపర్బ్​.

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్​లో కోహ్లీ-అయ్యర్ పార్ట్​నర్​షిప్ హైలైట్ అనే చెప్పాలి. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్​పై ఈ జోడీ ఆడిన తీరు సూపర్బ్​.

  • Author singhj Published - 10:28 AM, Mon - 6 November 23
సెంచరీపై స్పందించిన కోహ్లీ.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మెసేజ్ రావడంతోనే అంటూ..!

వేదికలు మారుతున్నాయి.. ప్రత్యర్థులూ మారుతున్నారు.. కానీ రిజల్ట్​లో ఏం తేడా లేదు. వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా డామినేషన్​లో మాత్రం ఏ మార్పూ లేదు. గెలుపును ఒక హాబీగా చేసుకొని అలుపనేదే లేకుండా దూసుకెళ్తోంది రోహిత్ సేన. వేరే జట్లపై చెలరేగి ఆడుతున్న వాళ్లు కూడా మన టీమ్ ముందుకొచ్చేసరికి చతికిలపడుతున్నారు. ఒకప్పటి ఆస్ట్రేలియా మాదిరిగా ప్రత్యర్థి టీమ్స్ కాన్ఫిడెన్స్ అంతా నీరుగారిపోయేలా.. ఒక్కసారిగా డిఫెన్స్​లో పడిపోయేలా గట్టి దెబ్బ కొడుతోంది భారత్. తాజాగా టీమిండియా ధాటికి సౌతాఫ్రికా కుదేలైంది.

వరల్డ్ కప్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్.. మొత్తంగా టోర్నమెంట్​లో నాలుగు 350 ప్లస్ స్కోర్లు సాధించిన సౌతాఫ్రికా.. ఆదివారం ఈడెన్ గార్డెన్స్​లో చేసిన స్కోరు 83. ఇదే వికెట్ మీద టీమిండియా స్కోరు 326. దీన్ని బట్టి భారత్ డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పిచ్​పై.. టీమిండియా బ్యాటర్లు పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. పుట్టిన రోజు నాడు అందరూ కోరుకున్న విధంగానే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. మిగతా ప్లేయర్లు అందరూ కలసికట్టుగా రాణించడంతో రోహిత్ సేన అకౌంట్​లో మరో భారీ విజయం వచ్చి చేరింది. దీంతో పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్ కూడా మనదే అయింది.

ఈడెన్ పిచ్ చాలా నెమ్మదించింది. రానురాను మందకొడిగా మారడంతో షాట్లు కొట్టడం కష్టమైంది. దీంతో మిడిల్ ఓవర్లలో కోహ్లీ-అయ్యర్​లు స్లోగా బ్యాటింగ్ చేశారు. వీళ్లిద్దరూ కలసి మూడో వికెట్​కు ఏకంగా 134 రన్స్ జోడించారు. మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్​గా దీన్నే చెప్పాలి. ఆ టైమ్​లో ఒకవేళ భారీ షాట్లకు ప్రయత్నిస్తే వికెట్ పోయేది. దీనిపై మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బయటి నుంచి చూసే వారికి ఈ పిచ్ అద్భుతంగా ఉందని అనిపించొచ్చు. కానీ పిచ్ మారింది. బాల్ బ్యాట్ మీదకు సరిగ్గా రాలేదు. ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలని డ్రెస్సింగ్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అందుకే చివరి వరకు క్రీజులో ఉన్నానని తెలిపాడు.

క్రీజులో కుదురుకొని లాస్ట్ వరకు ఉండటంతో సెంచరీ పూర్తి చేశానన్నాడు కోహ్లీ. దీనిపై అయ్యర్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఓపిక నశించడంతో తాను హిట్టింగ్ చేయాలని అనుకున్నానని శ్రేయస్ అన్నాడు. అయితే షాట్ల జోలికి పోకుండా మామూలుగా ఆడాలని డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ భాయ్ మెసేజ్ పంపాడని అయ్యర్ రివీల్ చేశాడు. కాబట్టి రోహిత్​తో పాటు కోచ్ ద్రవిడ్​కు కూడా క్రెడిట్​ ఇవ్వాల్సిందే. మరి.. పిచ్​ రియాక్ట్ అవుతున్న తీరును బట్టి డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ మెసేజ్ పంపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు.. రోహిత్ సేన విజయానికి 5 కారణాలు ఇవే..!