Nidhan
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టులో అవసరమా అనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. బ్యాటింగ్‌లో అతడి కంటే అశ్విన్ తోపు అని స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం..
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టులో అవసరమా అనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. బ్యాటింగ్‌లో అతడి కంటే అశ్విన్ తోపు అని స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం..
Nidhan
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియాతో ఓటమితో మొదలుపెట్టింది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయింది. భారత్ ఇంత దారుణంగా ఓడుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఓటమికి ప్రధాన కారణాల్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఒకటి. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిలయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో త్వరగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బాగా ఆడాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లపై అన్ని వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యంగ్ బ్యాటర్ గిల్‌ను కూడా చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. అతడు టీమ్‌లో అవసరం లేదని అంటున్నారు. గిల్ కంటే అశ్విన్ తోపు అని చెబుతున్నారు.
స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కరెక్ట్ అని చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొన్న గిల్.. కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 26 రన్స్ చేసిన యంగ్ బ్యాటర్.. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మార్కో యాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీ (76)కు తోడుగా గిల్ కూడా నిలబడి ఉంటే మ్యాచ్‌లో రిజల్ట్ వేరేలా ఉండేది. కనీసం ఇన్నింగ్స్ ఓటమి నుంచి భారత్ తప్పించుకునేది. కానీ శుబ్‌మన్ ఔట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు డ్రెస్సింగ్ రూమ్‌కు క్యూ కట్టడంతో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో మిగిలిన బ్యాటర్లతో పాటు గిల్‌ను కూడా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్.

గత కొన్నాళ్లుగా తరచూ విఫలమవుతున్న గిల్‌ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు రీసెంట్గా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతడు ఫెయిల్ అవడాన్ని గుర్తుచేస్తున్నారు. వన్డేల్లో తప్ప ఏ ఫార్మాట్లోనూ అతడు పెద్దగా పొడిచిందేమీ లేదని.. టెస్టుల్లో నుంచి అతడ్ని తీసేయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు స్టాటిస్టిక్స్ను ఎగ్జాంపుల్‌గా చెబుతున్నారు. గిల్ టెస్ట్ కెరీర్లో మొదటి 35 ఇన్నింగ్స్‌ల తర్వాత 994 రన్స్ చేశాడు. అదే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 35 ఇన్నింగ్స్‌ల అనంతరం 1,006 పరుగులు చేశాడు. కాబట్టి గిల్ కంటే అశ్విన్ తోపు అని.. శుబ్‌మన్‌ను జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి ప్లేసులో వేరే యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్స్ అంటున్నారు. మరి.. గిల్‌ను టెస్టుల్లో ఆడించొద్దనే డిమాండ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: వీడియో: ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు.. కోహ్లీని ఓదార్చిన రోహిత్!