అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
సంజూ శాంసన్.. మన దేశ ప్రస్తుత క్రికెట్ ప్లేయర్లలో ఎంతో ప్రతిభ కలిగిన వారిలో ఒకడు. సరిగ్గా ఆడితే ఈపాటికే టీమిండియా రెగ్యులర్ ఆటగాడు కావాల్సింది. గత టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లోనూ అతడు ఉండాల్సింది. కానీ సంజూ దురదృష్టమో లేదా ఏమో గానీ మంచి ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నా అతడికి మాత్రం జట్టులో చోటు దక్కడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాపులారిటీ సంపాదించిన వారిలో సంజూ ఒకడు. బ్యాటింగ్ సమయంలో అతడి టైమింగ్, క్లాస్, షాట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. క్లాస్ ప్లేయర్‌గా అతడు పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతీరుతోనే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్‌గా ప్రమోషన్ సంపాదించాడతను.
ఐపీఎల్లో బాగా ఆడుతున్నా, డొమెస్టిక్ లెవల్లోనూ సత్తా చాటుతున్నప్పటికీ భారత జట్టులో మాత్రం సంజూ శాంసన్‌కు ఎక్కువగా అవకాశాలు దొరకడం లేదు. టీమ్ వెంట కొన్ని సిరీస్‌ల పాటు తిరిగినా అతడికి అరకొరగానే ఛాన్సులు దొరికాయి. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దొరికినప్పుడు శాంసన్ అంతగా రాణించలేదు. ఫర్వాలేదనిపించేలానే అతడు ఆడాడు. దీంతో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ అతడి మీద నమ్మకం ఉంచలేదు. గత టీ20 ప్రపంచ కప్‌తో పాటు ఈసారి ఆసియా కప్, ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌నకూ సంజూను సెలక్ట్ చేయలేదు. దీంతో అతడి ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.
వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఆ టోర్నీలో ఆడిస్తారా? లేదా? అనే క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయకపోవడంతో టీమిండియా ప్రపంచ కప్ సన్నాహకాల్లో సంజూ ఉండకపోవచ్చునని క్లారిటీ వచ్చింది. దీంతో శాంసన్ కెరీర్‌ను బీసీసీఐ నాశనం చేస్తోందంటూ అతడి ఫ్యాన్స్ విమర్శలకు దిగారు. అయితే మొత్తానికి ఏమైందో ఏమో గానీ సంజూకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది బోర్డు. త్వరలో జరగనున్న సౌతాఫ్రికా సిరీస్‌కు సంజూను సెలక్ట్ చేసింది. అక్కడ జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు కల్పించింది. ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సంజూ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. కాగా, సంజూతో పాటు మరో యంగ్‌స్టర్ రజత్ పాటీదార్కూ ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దొరికింది. మరి.. సౌతాఫ్రికా సిరీస్‌కు సంజూను సెలక్ట్ చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సౌతాఫ్రికా టీ20, వన్డే సిరీస్‌కు టీమ్ ప్రకటన.. రోహితే కెప్టెన్!
Sanju Samson & Rajat Patidar included in the South Africa ODIs. [RevSportz] pic.twitter.com/yfK6TURZ3i
— Johns. (@CricCrazyJohns) November 30, 2023