iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికా సిరీస్​కు టీమ్స్ ప్రకటన.. కెప్టెన్స్ ఎవరంటే..?

  • Author singhj Updated - 08:59 PM, Thu - 30 November 23

సౌతాఫ్రికాతో సిరీస్​కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఈ సిరీస్​లో టీమిండియాను కెప్టెన్ ముందుండి ఎవరు నడపనున్నారో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో సిరీస్​కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఈ సిరీస్​లో టీమిండియాను కెప్టెన్ ముందుండి ఎవరు నడపనున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Updated - 08:59 PM, Thu - 30 November 23
సౌతాఫ్రికా సిరీస్​కు టీమ్స్ ప్రకటన.. కెప్టెన్స్ ఎవరంటే..?

సౌతాఫ్రికా టూర్ కోసం సెలక్షన్ కమిటీ ఎలాంటి టీమ్​ను ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా జరిగే టీ20ల్లో తిరిగి టీమిండియాకు కెప్టెన్​గా ఉండాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉందని వినిపించింది. 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి హిట్​మ్యాన్ పొట్టి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యలో జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి కొందరు టీ20ల్లో జట్టును నడిపించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్​లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

సఫారీ టూర్ గురించి డిస్కస్ చేయడంతో పాటు టీ20 వరల్డ్ కప్ రూట్ మ్యాప్​ను రూపొందించడానికి బీసీసీఐ సెక్రటరీ, సెలక్షన్ కమిటీ కన్వీనర్ జై షా.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్​తో ఇవాళ సమావేశం అయింది. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా వన్డే వరల్డ్ కప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో బౌలింగ్ వేస్తూ బంతిని ఆపబోయి గాయపడిన సంగతి తెలిసిందే. ఇంజ్యురీతో మెగా టోర్నీలోని మిగతా మ్యాచులకు దూరమైన ఈ స్టార్ ఆల్​రౌండర్ మరో నెలపాటు క్రికెట్​కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. గాయం నుంచి అతడు కోలుకునేందుకు మరికొన్ని వారాలు పట్టొచ్చని బీసీసీఐ వర్గాల సమాచారం.

గాయంతో హార్దిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్​కు సూర్యకుమార్ యాదవ్ లేదా రోహిత్ శర్మల్లో ఒకరికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాల్సిన పరిస్థితి. టీ20 ఫార్మాట్​లో తాను ఆడాలని అనుకోవడం లేదని రోహిత్ ఇంతకుముందే చెప్పాడు. కానీ వన్డే వరల్డ్ కప్​లో అతడు జట్టును నడిపిన తీరు చూశాక.. టీ20 ప్రపంచ కప్ వరకు పొట్టి ఫార్మాట్​లో హిట్​మ్యాన్ కంటిన్యూ అవ్వాలని బీసీసీఐ కోరిందట. కానీ రోహిత్ మాత్రం కేవలం టెస్టుల్లోనే టీమ్​ను లీడ్ చేస్తానని చెప్పాడట. విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ ఈ సిరీస్​లో ఆడనని చెప్పాడట. స్పీడ్​స్టర్ మహ్మద్ షమి కూడా కేవలం టెస్టులకే పరిమితం కానున్నాడు. దీంతో వన్డేలు, టీ20లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది బోర్డు. టీ20ల్లో సూర్యకుమార్ సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక, సౌతాఫ్రికాతో లిమిటెడ్ ఓవర్ల  సిరీస్​లో విరాట్ కోహ్లీ ఆడనని చెప్పేసిన సంగతి తెలిసిందే. రెస్ట్ కోసమే అతడు దూరంగా ఉంటానని అన్నాడు.

వన్డే టీమ్:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్​దీప్ యాదవ్, ముకేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్​దీప్ సింగ్, దీపక్ చాహర్.

టీ20 స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, జితేష్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్) , వాషింగ్టన్ సుందర్, కుల్​దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, దీపక్ చాహర్.

టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), జస్​ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, మహ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇదీ చదవండి: బుమ్రా కోపానికి అసలు కారణం అదే.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి