Nidhan
అభిమానులు తన నుంచి ఏదైతో కోరుకుంటున్నారో అది ఇచ్చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ఇలా చూసి చాన్నళ్లయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
అభిమానులు తన నుంచి ఏదైతో కోరుకుంటున్నారో అది ఇచ్చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ఇలా చూసి చాన్నళ్లయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Nidhan
ఒక విజయం.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఓటమి మిగిల్చిన బాధ నుంచి బయటపడేస్తుంది. మనసుకు సాంత్వన కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహలను తరిమికొడుతుంది. ఇది సక్సెస్‌కు ఉన్న ఇంపార్టెన్స్. మామూలు టైమ్‌లో కంటే కష్టాల్లో ఉన్నప్పుడు, ఓటములు ఎదురైనప్పుడు గెలుపు ఇచ్చే కిక్ సాధారణంగా ఉండదు. ఆ జోష్‌లో ఏదైనా చేయగలమనే నమ్మకం కలుగుతుంది. మన బలం రెట్టింపు అవుతుంది. మన సత్తా ఏంటనేది గెలుపు చూపిస్తుంది. ఇప్పుడు అదే జోష్‌లో కనిపిస్తున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా తొలి టెస్ట్‌లో ఎదురైన ఇన్నింగ్స్ పరాభవానికి తన స్టైల్లో రివేంజ్ తీర్చుకుంది. అయితే ఈ గెలుపు తర్వాత రోహిత్ సింహగర్జన చేయడం హైలైట్‌గా మారింది.
శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్ సింహంలా గర్జిస్తూ అతడ్ని పట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత చాన్నాళ్లు బాధలోనే ఉన్నాడు రోహిత్. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా టీమ్‌ను అంత అద్భుతంగా నడిపించినా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో కప్పు చేజారింది. దీంతో హిట్‌మ్యాన్ నిరాశలో మునిగిపోయాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి షాకిచ్చింది. ఐదు కప్‌లు సాధించి పెట్టిన రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి పీకేసింది. అతడి నుంచి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతల్ని బదిలీ చేసింది. అటు వరల్డ్ కప్ మిస్సవడం, ఇటు ముంబై కెప్టెన్సీ పోవడంతో రోహిత్ బాధ మరింత ఎక్కువైంది. ఆ తర్వాత తన కూతురు స్కూల్ ఫంక్షన్లో మొదటిసారిగా బయటకు వచ్చిన స్టార్ బ్యాటర్ తీవ్ర బాధలో ఉన్నట్లు కనిపించాడు.
సఫారీ టూర్‌కు బయల్దేరన రోహిత్ ఆ టైమ్‌లో ఒక వీడియోలో మాట్లాడుతూ.. ఫైనల్ ఓటమి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అందులో నుంచి బయటకు వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నానని చెప్పాడు. అయితే ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ను చూస్తుంటే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి అతడు పూర్తిగా బయట పడినట్లు కనిపిస్తున్నాడు. దీనికి ప్రూఫ్ ప్రొటీస్‌తో జరిగిన రెండో టెస్టే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్ సింహగర్జన చేశాడు. అయ్యర్‌ను పట్టుకొని విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంటెన్స్‌గా, ఫుల్ జోష్‌లో కనిపించిన హిట్‌మ్యాన్‌ను చూసిన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్లకు మళ్లీ పాత రోహిత్‌ను చూశామని.. ఇక మీదటా అతడు ఇలాగే ఉండాలని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఇక మీదట అతడి వేట మొదలవుతుందని చెబుతున్నారు. మరి.. రోహిత్ తన పాత స్టైల్లో కనిపిస్తుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: మరోసారి బెయిల్స్ కు మంత్రం వేసిన కోహ్లీ.. ఈసారి ఏమైందో చూడండి!
The shortest ever Test match in history.
– Wraps up in 5 sessions..!!!pic.twitter.com/s0a5kZ0ETU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2024