Nidhan
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఓటమితో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఓ టీమిండియా మాజీ క్రికెటర్ హిట్‌మ్యాన్‌ను టార్గెట్ చేసుకొని సీరియస్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీకి రోహిత్ పనికి రాడన్నాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఓటమితో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఓ టీమిండియా మాజీ క్రికెటర్ హిట్‌మ్యాన్‌ను టార్గెట్ చేసుకొని సీరియస్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీకి రోహిత్ పనికి రాడన్నాడు.
Nidhan
స్వదేశంలో పులులు, విదేశాల్లో పిల్లులు అనే ముద్ర ఒకప్పుడు టీమిండియా మీద ఉండేది. టెస్టుల్లో భారత్ ఈ అపప్రదను మూటగట్టుకుంది. కానీ దీన్ని క్రమంగా చెరిపేస్తూ వచ్చింది. గత రెండు వరల్డ్ టెస్ట్ సిరీస్‌ల్లో ఫైనల్‌కు చేరుకోవడం, ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డ మీద ఓడించడం, ఇంగ్లండ్‌ను వాళ్ల నేల మీదే ముప్పుతిప్పలు పెట్టడం దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. లాంగ్ ఫార్మాట్లో ఎప్పటిలాగే సొంత గడ్డ మీద సూపర్బ్‌గా ఆడుతున్న టీమిండియా.. విదేశాల్లోనూ ఎక్స్పెక్ట్ చేసిన దాని కంటే బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దూకుడుగా ఆడటం స్టార్ట్ చేసిన మన టీమ్.. రోహిత్ శర్మ సారథ్యంలోనూ దాన్నే కొనసాగిస్తూ టెస్టుల్లో దూసుకెళ్తోంది. అయితే సౌతాఫ్రికా గడ్డ మీద ప్రొటీస్‌ను ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గుదామనే డ్రీమ్ అలాగే ఉండిపోయింది. ఈసారైనా దీన్ని నిజం చేస్తారనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో అందరూ కెప్టెన్ రోహిత్‌ను విమర్శిస్తున్నారు.
హిట్‌మ్యాన్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కెప్టెన్‌గానూ ఫెయిల్ అవడం సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్‌లో భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా రోహిత్‌ను టార్గెట్ చేసుకొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ కెప్టెన్‌గా పనికి రాడన్నాడు. అతడి ప్లేస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే సరైనోడు అని చెప్పాడు. కోహ్లీని ఎందుకు కెప్టెన్సీ నుంచి తీసేశారని ప్రశ్నించాడు. ‘టెస్ట్ టీమ్‌కు అతను (కోహ్లీ) ఎందుకు కెప్టెన్‌గా లేడు? నేను అడుగుతోంది విలువైన ప్రశ్న. అతను మంచి టెస్ట్ బ్యాటర్. విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకు మధ్య పోలికే లేదు. టెస్ట్ క్రికెట్లో విరాట్ చాలా పెద్ద ప్లేయర్. అతడు ఆడిన ప్రతి చోట పరుగులు చేశాడు. అతడు టీమ్‌ను ఎందుకు లీడ్ చేయడం లేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా కూడా ప్రూవ్ చేసుకోని రోహిత్ కెప్టెన్‌గా ఎందుకు ఉన్నాడు? భారత్‌కు అవతల ఆడిన టెస్టుల్లో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది’ అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ కెప్టెన్‌గా ఉండటం కరెక్ట్ కాదని.. సారథ్య బాధ్యతలను కోహ్లీకి అప్పగించాలని బద్రీనాథ్ సూచించాడు. టెస్టుల్లో సారథిగా విరాట్‌కు గొప్ప రికార్డు ఉందని గుర్తుచేశాడు. కెప్టెన్‌గా టీమ్‌ను లీడ్ చేస్తూ 52 ప్లస్ యావరేజ్‌తో 5 వేలకు పైగా రన్స్ చేశాడని తెలిపాడు. కింగ్ సారథ్యంలో భారత జట్టు 68 టెస్టుల్లో 40 మ్యాచుల్లో గెలిచి, మరో 17 మ్యాచుల్లో ఓడిందన్నాడు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సిరీస్‌లోనూ కోహ్లీ టీమ్‌ను గెలిపించాడని బద్రీనాథ్ పేర్కొన్నాడు. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కోహ్లీని కెప్టెన్సీకి దూరంగా ఉంచడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించాడు. మరి.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తీసేసి విరాట్‌కు టీమ్ బాధ్యతలు అప్పజెప్పాలంటూ బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్.. వరల్డ్ కప్ అంతా ఇంజెక్షన్స్ తీసుకుని ఆడిన టీమిండియా క్రికెటర్!
S Badrinath said, “Virat Kohli should be the Test captain of India. There is no comparison between Virat Kohli and Rohit Sharma. He is a big player, in terms of Test cricket. Rohit has not proven himself as an opener outside India. Why is he there?”. pic.twitter.com/r6tYApBFvU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023