iDreamPost
android-app
ios-app

రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. వరల్డ్ కప్ హిస్టరీలోనే..!

  • Author singhj Published - 10:36 AM, Mon - 6 November 23

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగిపోయాడు. బ్యాటింగ్​లో 15 బంతుల్లో 29 రన్స్ చేసిన జడ్డూ.. బౌలింగ్​లో ఏకంగా 5 వికెట్లు తీసి మ్యాచ్​ను వన్​సైడ్ చేసేశాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్​లో స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగిపోయాడు. బ్యాటింగ్​లో 15 బంతుల్లో 29 రన్స్ చేసిన జడ్డూ.. బౌలింగ్​లో ఏకంగా 5 వికెట్లు తీసి మ్యాచ్​ను వన్​సైడ్ చేసేశాడు.

  • Author singhj Published - 10:36 AM, Mon - 6 November 23
రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. వరల్డ్ కప్ హిస్టరీలోనే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా తన ప్రత్యర్థులను ఒక పద్ధతి ప్రకారం వేటాడుతోంది. మొదట బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి టీమ్​ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. అనంతరం టార్గెట్​ను ఈజీగా ఛేజ్ చేసేస్తోంది. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అపోజిషన్ టీమ్​ ముందు భారీ స్కోరు పెట్టడం.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగిపోయి ప్రత్యర్థిని కుప్పకూల్చడం.. ఈ వరల్డ్ కప్​ల్లో చాలా మ్యాచుల్లో ఇదే వరస. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్​లో కూడా దీనికి భిన్నంగా ఏమీ జరగలేదు. భీకరమైన బ్యాటర్లు ఉన్న సఫారీ టీమ్ భారత బౌలర్లకు పరీక్ష పెడుతుందేమో అనుకుంటే.. పేలవంగా ఆడి ఛేజింగ్​లో చిత్తయిపోయింది.

కొత్త బంతితో బౌలింగ్ చేసిన జస్​ప్రీత్ బుమ్రా వికెట్ తీయలేకపోయాడు. కానీ ఆ టీమ్ ఓపెనర్లు తెంబా బవుమా, క్వింటన్ డికాక్ సహా వాండర్ డస్సెన్​ను బుమ్రా ముప్పుతిప్పలు పెట్టాడు. ఫస్ట్ స్పెల్​లో అతడు 5 ఓవర్లు వేశాడు. అందులో 23 డాట్ బాల్స్ ఉన్నాయి. దీన్ని బట్టే బుమ్రా బౌలింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా పెట్టిన ఒత్తిడి కారణంగా సిరాజ్​కు డికాక్ దొరికిపోయాడు. డస్సెన్, మార్క్​రమ్​ను షమి తన బుట్టలో వేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్పిన్నర్ జడేజా మ్యాజిక్ మొదలైంది. మొదట సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను బౌల్డ్ చేసిన జడ్డూ.. ఆ తర్వాత క్లాసెన్​ను వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు.

మిల్లర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడలను కూడా ఔట్ చేసిన జడేజా మొత్తంగా ఈ మ్యాచ్​లో 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్​లో రెండు, మూడు వికెట్లకే పరిమితమైన జడ్డూ.. తన విశ్వరూపాన్ని సఫారీలపై చూపించాడు. జడేజా బౌలింగ్ వేస్తుంటే ప్రతి బాల్​కు వికెట్ పడుతుందే అనిపించింది. ఈ పెర్ఫార్మెన్స్​తో వరల్డ్ కప్ హిస్టరీలో అరుదైన ఘనత సాధించాడు జడేజా. ప్రపంచ కప్​లో 5 వికెట్లు తీసుకున్న భారత స్పిన్నర్ల జాబితాలో యువరాజ్ సింగ్ రికార్డును అతడు సమం చేశాడు. వరల్డ్ కప్​లో 5 వికెట్లు తీసుకున్న రెండో భారత స్పిన్నర్​గా జడ్డూ నిలిచాడు. ఇంతకుముందు 2011లో ఐర్లాండ్​తో మ్యాచ్​లో యువీ ఐదు వికెట్లు తీశాడు. మరి.. ఈ మ్యాచ్​లో జడ్డూ బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు.. రోహిత్ సేన విజయానికి 5 కారణాలు ఇవే..!