IND vs SA: సెలక్టర్లపై ఆశిష్ నెహ్రా సీరియస్.. అతడు మీకు కనిపించట్లేదా అంటూ..!

  • Author singhj Published - 03:39 PM, Sat - 2 December 23

భారత సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా సీరియస్ అయ్యాడు. ఆ ప్లేయర్​ను ఎంపిక చేయకుండా వాళ్లు తప్పు చేశారంటూ ఫైర్ అయ్యాడు.

భారత సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా సీరియస్ అయ్యాడు. ఆ ప్లేయర్​ను ఎంపిక చేయకుండా వాళ్లు తప్పు చేశారంటూ ఫైర్ అయ్యాడు.

  • Author singhj Published - 03:39 PM, Sat - 2 December 23

ఇప్పుడు భారత క్రికెట్​కు సంబంధించి సౌతాఫ్రికా టూర్​ గురించి బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్​ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ మీద అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరూ సీనియర్లు లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో కొనసాగుతారా అనే సందేహాలు వచ్చాయి. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత నుంచి వీళ్లిద్దరూ పొట్టి ఫార్మాట్​కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏడు నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్​లో రోహిత్-కోహ్లీ ఆడతారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే సఫారీ టూర్​కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఇందులో కేవలం టెస్టుల్లో మాత్రమే రోహిత్, కోహ్లీని సెలక్ట్ చేశారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్​కు ప్రకటించిన టీమ్​లో వీళ్లిద్దరికీ చోటు దక్కలేదు.

సౌతాఫ్రికా సిరీస్​లో వన్డేలు, టీ20లకు దూరంగా ఉంటామని స్వయంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బీసీసీఐకి చెప్పారట. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. సీరియస్ క్రికెటర్ల వినతికి ఓకే చెప్పిన బోర్డు.. వారు విశ్రాంతి తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఈ సిరీస్​కు మాత్రమే రోహిత్, కోహ్లీలు దూరంగా ఉంటారా? తదుపరి జరిగే వన్డే, టీ20 సిరీస్​ల్లో వాళ్లు ఆడతారా? అనే దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇక, ఈ సిరీస్​లో ఆడే టెస్టు జట్టుకు హిట్​మ్యాన్ కెప్టెన్​గా ఉండనున్నాడు. అదే వన్డే టీమ్​కు కేఎల్ రాహుల్ సారథిగా ఉండనుండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించే బాధ్యతలు తీసుకోనున్నాడు. ఒక సిరీస్​లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లతో బరిలోకి దిగుతుండటం బహుశా భారత క్రికెట్​లో ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు.

సౌతాఫ్రికా సిరీస్​లో టీ20లు, వన్డేలకు చాలా మంది యువకుల్ని ఎంపిక చేశారు. డొమెస్టిక్ లెవల్లో సత్తా చాటుతున్న వారికి అవకాశాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో ఛాన్సులు లేక ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ లాంటి వారికి కూడా స్క్వాడ్​లో చోటు కల్పించారు. కానీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్​కు మాత్రం సెలక్టర్లు మళ్లీ మొండిచెయ్యి చూపించారు. రీసెంట్​గా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు డొమెస్టిక్ లెవల్లో బాగా రాణిస్తున్న భువీని సెలక్టర్లు పక్కన పెట్టడంపై లెజెండరీ బౌలర్ ఆశిష్ నెహ్రా సీరియస్ అయ్యాడు. వాళ్లకు భువనేశ్వర్ కనిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యాడు.

‘సౌతాఫ్రికా టూర్ కోసం వేర్వేరు టీమ్స్​ను సెలక్టర్లు ఎంపిక చేయడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. జట్టులో చోటు కోసం ఎదురు చూసిన వారికి ఛాన్స్ దక్కడం సంతోషకరమే. అయితే ఈ టూర్ గురించి వినగానే నా మైండ్​లో వచ్చిన మొదటి పేరు భువనేశ్వర్ కుమార్. సౌతాఫ్రికా వెళ్తున్నామంటే అందులో ఎక్కువగా పేస్ బౌలర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే కొత్త బంతితో వికెట్లు తీయగల అర్ష్​దీప్ సింగ్, ముకేష్ కుమార్ లాంటి యంగ్​ బౌలర్స్ రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న భువనేశ్వర్ లాంటి స్పీడ్​స్టర్ టీమ్​లో ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. అతడ్ని సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదు. వన్డేలతో పాటు టీ20ల్లో అతడి అవసరం జట్టుకు ఉంది’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ ఏకంగా 16 వికెట్లు తీశాడు. మరి.. భువనేశ్వర్​ను సెలక్ట్ చేయకుండా సెలక్టర్లు తప్పు చేశారంటూ నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Ruthuraj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ నయా రికార్డు.. తొలి భారత క్రికెటర్ గా!

Show comments