iDreamPost

Ruthuraj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ నయా రికార్డు.. తొలి భారత క్రికెటర్ గా!

  • Author Soma Sekhar Published - 01:41 PM, Sat - 2 December 23

ఆసీస్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు రుతురాజ్ గైక్వాడ్. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్ చేసి.. తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.

ఆసీస్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు రుతురాజ్ గైక్వాడ్. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్ చేసి.. తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.

  • Author Soma Sekhar Published - 01:41 PM, Sat - 2 December 23
Ruthuraj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ నయా రికార్డు.. తొలి భారత క్రికెటర్ గా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత జట్టు 3-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో టీమిండియా యంగ్ స్టర్స్ రెచ్చిపోతున్నారు. జైస్వాల్, రుతురాజ్, రింకూ సింగ్ తో పాటుగా మరికొందరు యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఘతన సాధించిన తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. ఈ నయా రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రుతురాజ్ గైక్వాడ్.. ప్రస్తుతం టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు ఈ యువ క్రికెటర్. కంగారూ టీమ్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు రుతురాజ్. ఈ మ్యాచ్ లో వన్ మ్యాన్ షోతో అలరించిన గైక్వాడ్ 123 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కానీ దురదృష్టవ శాత్తు ఈ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక నాలుగో మ్యాచ్ లో 32 పరుగులుతో పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే?

టీ20ల్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు రుతురాజ్. కేవలం 116 ఇన్నింగ్స్ ల్లోనే గైక్వాడ్ ఈ ఫీట్ ను సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. అతడు 117 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు రుతురాజ్. ఇదిలా ఉండగా టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా పలువురు మాజీ క్రికెటర్లు గైక్వాడ్ పేరును సూచిస్తున్నారు. అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పలువురు కితాబిస్తున్నారు. మరి కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్ చేసిన రుతురాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి