బుమ్రా, షహీన్.. ఇద్దరిలో ఎవరు డేంజర్? గంభీర్ ఏమన్నాడంటే..!

  • Author singhj Published - 04:44 PM, Fri - 13 October 23
  • Author singhj Published - 04:44 PM, Fri - 13 October 23
బుమ్రా, షహీన్.. ఇద్దరిలో ఎవరు డేంజర్? గంభీర్ ఏమన్నాడంటే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్​గా ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్​లు గ్రౌండ్​లో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయిపోయాయి. మరికొన్ని గంటల్లో ఈ కొదమ సింహాల మధ్య ఫైట్ షురూ కానుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ప్రపంచ కప్​లోనే అత్యంత కీలక ఫైట్​ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాలు, బలహీనతలపై డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎవరు బలంగా ఉన్నారు? ఏ టీమ్ గెలుస్తుంది? రికార్డులు ఎవరి వైపు ఉన్నాయి? పిచ్ ఎలా ఉండబోతోంది? ఏయే ప్లేయర్లు కీలకంగా మారనున్నారనే చర్చ నడుస్తోంది.

వరల్డ్ క్రికెట్​లోనే అత్యంత మజా కలిగించే మ్యాచ్​లో అందరి చూపు భారత స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీపై ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు సత్తా చాటితే ఆ జట్టు ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో టీమ్​కు విజయాన్ని అందించగల, మ్యాచ్​ స్వరూపాన్ని మార్చే సత్తా వీరి సొంతం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు పేసర్లలో ఎవరు డేంజరస్ అనే దానిపై టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ విశ్లేషించాడు. షహీన్ కంటే బుమ్రా అత్యంత ప్రమాదకారి అని పేర్కొన్నాడు. షహీన్​కు బుమ్రాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నాడు గౌతీ.

‘ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్​ను బుమ్రా ఔట్ చేసిన తీరు అద్భుతం. అలాగే ఆఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్​కు కూడా అదే విధంగా అతడు బోల్తా కొట్టించాడు. అందుకే, వరల్డ్​లోనే మోస్ట్ డేంజరస్ బౌలర్​గా బుమ్రానే సెలక్ట్ చేస్తా. ఇప్పుడు చాలా మంది బుమ్రా-షహీన్​ను కంపేర్ చేస్తూ విశ్లేషణలు మొదలుపెట్టారు. వాళ్లిద్దరి బౌలింగ్ విషయంలో చాలా తేడాలున్నాయి. కొందరు కొత్త బంతితో అదరగొడితే.. మరికొందరు డెత్ ఓవర్లలో చెలరేగి బౌలింగ్ చేస్తారు. కానీ బుమ్రా అటు ఆరంభంలోనూ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలోనూ ప్రభావం చూపించగలడు. బాల్ కొత్తదా? పాతబడిందా? అనేది అతడు పట్టించుకోడు. షహీన్​లో ఆ లక్షణాలు కనిపించవు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. బుమ్రా-షహీన్​లో ఎవరు డేంజరస్ బౌలర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరుసగా ఓటములు.. ఆ ఒక్క నిర్ణయమే కంగారూల కొంప ముంచిందా?

Show comments