వన్డే వరల్డ్ కప్-2023లో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్‌లు గ్రౌండ్లో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయిపోయాయి. మరికొన్ని గంటల్లో ఈ కొదమ సింహాల మధ్య ఫైట్ షురూ కానుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ప్రపంచ కప్‌లోనే అత్యంత కీలక ఫైట్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాలు, బలహీనతలపై డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎవరు బలంగా ఉన్నారు? ఏ టీమ్ గెలుస్తుంది? రికార్డులు ఎవరి వైపు ఉన్నాయి? పిచ్ ఎలా ఉండబోతోంది? ఏయే ప్లేయర్లు కీలకంగా మారనున్నారనే చర్చ నడుస్తోంది.
వరల్డ్ క్రికెట్లోనే అత్యంత మజా కలిగించే మ్యాచ్‌లో అందరి చూపు భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీపై ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు సత్తా చాటితే ఆ జట్టు ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో టీమ్‌కు విజయాన్ని అందించగల, మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా వీరి సొంతం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు పేసర్లలో ఎవరు డేంజరస్ అనే దానిపై టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ విశ్లేషించాడు. షహీన్ కంటే బుమ్రా అత్యంత ప్రమాదకారి అని పేర్కొన్నాడు. షహీన్‌కు బుమ్రాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నాడు గౌతీ.
‘ఫస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను బుమ్రా ఔట్ చేసిన తీరు అద్భుతం. అలాగే ఆఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్‌కు కూడా అదే విధంగా అతడు బోల్తా కొట్టించాడు. అందుకే, వరల్డ్‌లోనే మోస్ట్ డేంజరస్ బౌలర్‌గా బుమ్రానే సెలక్ట్ చేస్తా. ఇప్పుడు చాలా మంది బుమ్రా-షహీన్‌ను కంపేర్ చేస్తూ విశ్లేషణలు మొదలుపెట్టారు. వాళ్లిద్దరి బౌలింగ్ విషయంలో చాలా తేడాలున్నాయి. కొందరు కొత్త బంతితో అదరగొడితే.. మరికొందరు డెత్ ఓవర్లలో చెలరేగి బౌలింగ్ చేస్తారు. కానీ బుమ్రా అటు ఆరంభంలోనూ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలోనూ ప్రభావం చూపించగలడు. బాల్ కొత్తదా? పాతబడిందా? అనేది అతడు పట్టించుకోడు. షహీన్లో ఆ లక్షణాలు కనిపించవు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. బుమ్రా-షహీన్లో ఎవరు డేంజరస్ బౌలర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరుసగా ఓటములు.. ఆ ఒక్క నిర్ణయమే కంగారూల కొంప ముంచిందా?