కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన ఓ బాల్ డారిల్ మిచెల్‌కు గట్టిగా తగిలింది. ఈ బాల్‌కు రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ బాగా వైరల్ అవుతోంది.
కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన ఓ బాల్ డారిల్ మిచెల్‌కు గట్టిగా తగిలింది. ఈ బాల్‌కు రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ బాగా వైరల్ అవుతోంది.
ఎవరి మీద గెలిచినా వాళ్ల మీద నెగ్గలేరన్నారు. వారితో అంత ఈజీ కాదన్నారు. వరల్డ్ కప్స్‌లో రికార్డు దారుణంగా ఉంది.. ఆశలు వదులుకోమన్నారు. న్యూజిలాండ్‌తో టీమిండియా మ్యాచ్ అనగానే చాలా మంది చేసిన వార్నింగ్ ఇది. ఈ అంచనా నిజమైంది. రోహిత్ సేన లాగే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గిన కివీస్.. అంత ఈజీగా లొంగలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మధ్యలో.. అలాగే భారత్ ఛేజింగ్ చేస్తున్న టైమ్‌లో.. టోర్నమెంట్లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురు కాబోతోందా? అనే భయాలు ఫ్యాన్స్‌కు కలిగాయి. బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ టీమిండియాకు సవాలు విసిరింది కివీస్. కానీ ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన రోహిత్ సేన.. ధర్మశాలలో అద్భుత విజయాన్ని అందుకుంది.
మెగా టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని అకౌంట్లో వేసుకున్న భారత్.. సెమీఫైనల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఫైనల్ ఎలెవన్‌లో ప్లేస్ దక్కక నిరాశలో ఉన్న మహ్మద్ షమి వచ్చిన ఛాన్స్‌ను యూజ్ చేసుకున్నాడు. తుది జట్టు నుంచి తనను దూరం పెట్టడం ఎంత తప్పో తెలియజేస్తూ కసిగా బౌలింగ్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మరో గ్రేట్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. మొత్తానికి కివీస్‌పై ఐసీసీ టోర్నీల్లో 20 ఏళ్ల తర్వాత సాధించిన ఈ గెలుపు టీమిండియాకు ఎంతో స్పెషల్. ఈ మ్యాచ్‌లో గెలుపుకు భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఒక దశలో 19 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. ఆ తర్వాత మిచెల్-రచిన్ రవీంద్ర పార్ట్నర్షిప్తో భారీ స్కోరు చేసేలా కనిపించింది.
మిచెల్-రచిన్ పార్ట్‌నర్‌షిప్‌ను మహ్మద్ షమి విడగొట్టాడు. రచిన్‌ను షమి ఔట్ చేశాడు. అయినా మిచెల్ వెనుకంజ వేయలేదు. సెంచరీ పూర్తయ్యాక కూడా మంచి షాట్లు ఆడాడు. అయితే ఒకవైపు మిచెల్ బాగా ఆడుతున్నా.. మరోవైపు మిగిలిన కివీస్ బ్యాటర్ల పనిపట్టారు కుల్దీప్, షమి. వీళ్ల దెబ్బకు ఒక్క ఫిలిప్స్ తప్ప ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అంత ఎఫెక్టివ్‌గా వీళ్లిద్దరూ బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కుల్దీప్ తన లాస్ట్ స్పెల్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి దెబ్బకు అప్పటికే క్రీజులో కుదురుకున్న మిచెల్ కూడా షాకయ్యాడు.
కుల్దీప్ యాదవ్ మామూలుగా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయడు. అయితే ఈ మధ్య అతడు స్పీడ్ పెంచి బాల్స్ వేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో అతడు వేసిన ఓ బాల్ 114 కి.మీ.ల స్పీడ్‌తో దూసుకెళ్లింది. షాట్ కొట్టడంలో ఫెయిల్ అవ్వడంతో బాల్ మిస్సై మిచెల్ మోచేతికి గట్టిగా తాకింది. దీంతో నొప్పితో అతను తల్లడిల్లాడు. అయితే కుల్దీప్, రోహిత్ మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ అయితే చిన్న పిల్లాడిలా నవ్వేశాడు. హిట్‌మ్యాన్ నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. కుల్దీప్ బాల్‌కు రోహిత్ నవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: అతని కంటే గొప్ప ఫినిషర్ లేడంటూ.. గంభీర సంచలన స్టేట్‌మెంట్!
The Bowl of the day 🤣🤣🤣#RohitSharma #ViratKohli𓃵 #KuldeepYadav #INDvsNZ pic.twitter.com/c52NQUaZkU
— Aasim Farooqui (@AsmFar07) October 22, 2023