iDreamPost

World Cup 2023: అతని కంటే గొప్ప ఫినిషర్‌ లేడంటూ.. గంభీర సంచలన స్టేట్‌మెంట్‌!

  • Published Oct 23, 2023 | 2:32 PMUpdated Oct 23, 2023 | 2:32 PM

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. నిత్యం ఏదో ఒక ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్య చూస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా అతనే గొప్ప ఫినిషర్‌ అంటూ ఓ భారీ స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు. మరీ గంభీర్‌ చెబుతున్న ఆ బెస్ట్‌ ఫినిషర్‌ ఎవరో చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. నిత్యం ఏదో ఒక ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్య చూస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా అతనే గొప్ప ఫినిషర్‌ అంటూ ఓ భారీ స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు. మరీ గంభీర్‌ చెబుతున్న ఆ బెస్ట్‌ ఫినిషర్‌ ఎవరో చూద్దాం..

  • Published Oct 23, 2023 | 2:32 PMUpdated Oct 23, 2023 | 2:32 PM
World Cup 2023: అతని కంటే గొప్ప ఫినిషర్‌ లేడంటూ.. గంభీర సంచలన స్టేట్‌మెంట్‌!

వరల్డ్‌ కప్‌ వేటలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లాంటి పటిష్టమైన జట్లతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లపై సూపర్‌ విక్టరీలు సాధించింది. ఇదే వరుసలో ఈ టోర్నీలోనే మనకు బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న న్యూజిలాండ్‌ను సైతం మట్టికరిపించింది. 4 వికెట్ల తేడాతో కివీస్‌పై విజయం సాధించిన రోహిత్‌ సేన.. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు బుమ్రా, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. ఆ తర్వాత డారిల్‌ మిచెల్‌-రచిన్‌ రవీంద్ర సూపర్‌ పార్ట్నర్‌షిప్‌తో టీమిండియా ఆధిపత్యం చెలాయించారు. కాగా, చివర్లో షమీ చెలరేగడం, సిరాజ్‌, బుమ్రా మంచి సపోర్ట్‌ అందించడంతో 300 ప్లస్‌ స్కోర్‌ చేయాల్సిన కివీస్‌ కేవలం 273 పరుగుల స్కోర్‌కే పరిమితం అయింది.

274 టార్గెట్‌ను కూడా టీమిండియా అంత ఈజీగా ఏం ఛేజ్‌ చేయలేదు. ఎందుకంటే అక్కడుంది న్యూజిలాండ్‌. కానీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ టోర్నీలో చూపిస్తున్న అగ్రెసివ్‌ ఇంటెంట్‌నే ఈ మ్యాచ్‌లో కూడా చూపించాడు. ఫోర్లు, సిక్సులతో న్యూజిలాండ్‌ బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కానీ, రోహిత్‌ అవుట్‌ తర్వాత వెంటనే మరో వికెట్‌ పడటంతో కోహ్లీ.. గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, జడేజాలతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే.. విజయానికి 5 పరుగులు, తన సెంచరీకి ఐదు పరుగులు అవసరమైన సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ పూర్తి చేయకపోయినా.. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మ్యాచ్‌ను దాదాపు గెలిపించి వెళ్లాడు. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరాట్‌ కోహ్లీని మించిన ఫినిషర్‌ లేడంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఫినిషర్‌ అంటే 6, 7 స్థానాల్లోనే బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేదని, చివరి వరకు క్రీజ్‌లో ఉండి, మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడి మ్యాచ్‌ను చేతుల్లో పెట్టేవాడే అసలైన ఫినిషర్‌ అంటూ గంభీర్‌ పేర్కొన్నాడు. గంభీర్‌ అన్నట్లు వన్డేల్లో కోహ్లీని అసలు సిసలు ఫినిషర్‌గా చెప్పుకోచ్చు. అందుకే అతని ఛేజ్‌ మాస్టర్‌ అనే బిరుదు కూడా ఉంది. వన్డే మ్యాచ్‌లు ఎలా ఆడాలో కోహ్లీకి తెలినంత బాగా మరెవరికీ తెలియదనుకేనేలా ఆడతాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి. కావాల్సిన రన్‌రేట్‌కు అనుగుణంగా గేర్‌ మారుస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో స్ట్రేక్‌ రోటేట్‌ చేస్తూ.. భారీ షాట్లు కూడా ఆడి మ్యాచ్‌ను గెలిపిస్తాడు. అందుకే గంభీర్‌ అన్నట్లు కోహ్లీని బెస్ట్‌ ఫినిషర్‌ అనుకోవచ్చు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ కానీ, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ కానీ కోహ్లీ ఆడిన విధానం చూస్తే.. గంభీర్‌ చెప్పింది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగే 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ని ఎవరు మర్చిపోగలరు. టీ20ల్లో కూడా కోహ్లీ బెస్ట్‌ ఫినిషర్‌ అనేందుకు అది బెస్ట్‌ ఉదాహనణ. మరి గంభీర్‌ వ్యాఖ్యలపై మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: రనౌట్‌ విషయంలో సూర్య చేసింది.. త్యాగమా? తప్పా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి