iDreamPost
android-app
ios-app

World Cup: అనవసరంగా బుమ్రాను అంటున్నారు.. తప్పు అతడిది కాదు!

  • Author singhj Published - 05:23 PM, Mon - 23 October 23

కివీస్​పై భారత్ విక్టరీ సాధించడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు. అయితే నిన్నటి మ్యాచ్​లో జస్​ప్రీత్ బుమ్రాను ఓ విషయంలో మాత్రం తప్పుబడుతున్నారు. అయితే బుమ్రాది తప్పు లేదని తెలుస్తోంది. ఈ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కివీస్​పై భారత్ విక్టరీ సాధించడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు. అయితే నిన్నటి మ్యాచ్​లో జస్​ప్రీత్ బుమ్రాను ఓ విషయంలో మాత్రం తప్పుబడుతున్నారు. అయితే బుమ్రాది తప్పు లేదని తెలుస్తోంది. ఈ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 05:23 PM, Mon - 23 October 23
World Cup: అనవసరంగా బుమ్రాను అంటున్నారు.. తప్పు అతడిది కాదు!

వన్డే వరల్డ్ కప్-2023లో భారత క్రికెట్ టీమ్ జైత్రయాత కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా టీమిండియా దూసుకెళ్తోంది. తొలి నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్​కు ఐదో మ్యాచ్​లో టఫ్ ఛాలెంజ్ ఎదురైంది. రోహిత్ సేన లాగే నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన కివీస్​తో మ్యాచ్ అంటే అంత ఈజీ కాదని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇరు టీమ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్​ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది. అయితే ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేసిన భారత్ మరో విక్టరీని అకౌంట్​లో వేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్ కప్స్​లో న్యూజిలాండ్​పై గెలిచింది.

ఈ మ్యాచ్​లో ఒక దశలో న్యూజిలాండ్ బ్యాటర్ల దూకుడు చూస్తే ఈజీగా 320 ప్లస్ స్కోరు చేస్తుందనిపించింది. కానీ మహ్మద్ షమీతో పాటు కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కివీస్ 273కే పరిమితమైంది. మిడిల్ ఓవర్లలో బాగా రన్స్ ఇచ్చిన బౌలర్స్.. చివరి 15 ఓవర్లలో మాత్రం చెలరేగి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా షమి, కుల్దీప్ కివీస్ బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. ఒకవైపు పరుగులు రాకపోవడం, మరోవైపు ఓవర్లు అయిపోతుండటంతో ప్రత్యర్థి బ్యాటర్లు అటాకింగ్​కు దిగి వికెట్లు పారేసుకున్నారు. ఈ మ్యాచ్​లో భారత్ గెలుపులో సెంచరీ బాదిన కోహ్లీకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంతే క్రెడిట్ బౌలింగ్​లో ఇరగదీసిన షమీకి ఇవ్వాలి.

ఇక, న్యూజిలాండ్​తో మ్యాచ్​లో టీమిండియా చాలా పేలవంగా ఫీల్డింగ్ చేసింది. క్యాచ్​లు మిస్ చేయడంతో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్​ కూడా రేంజ్​కు తగ్గట్లు చేయలేదు. నంబర్ వన్ ఫీల్డర్ రవీంద్ర జడేజాతో పాటు పేసర్ జస్​ప్రీత్ బుమ్రా, కీపర్ కేఎల్ రాహుల్​ క్యాచ్​లు వదిలేశారు. బుమ్రా అయితే రెండు ఫోర్లు కూడా వదిలేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బుమ్రా.. ఇదేం చెత్త ఫీల్డింగ్ అంటూ అతడ్ని విమర్శిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇందులో అతడి తప్పేమీ లేదని తెలుస్తోంది. భారత్-కివీస్​ మ్యాచ్​ జరిగిన ధర్మశాలలో ఔట్​ఫీల్డ్ పేలవంగా ఉండటమే దీనికి కారణమట. తప్పంతా స్టేడియం నిర్వాహకులదేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ధర్మశాల గ్రౌండ్లో ఔట్​ఫీల్డ్ పేలవంగా ఉండటంతో భారత్, న్యూజిలాండ్ ప్లేయర్లు ఇంజ్యురీ భయంతో డైవ్ చేయడానికి వెనుకాడారు. కివీస్ ఇన్నింగ్స్ టైమ్​లో జారుతూ బాల్​ను ఆపేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ వేలికి గాయం చేసుకున్నాడు. ట్రీట్​మెంట్ కోసం గ్రౌండ్​ను వీడి కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చాడు. 35వ ఓవర్​లో ఫైన్ లెగ్ బౌండరీ దగ్గర బుమ్రా డైవ్ చేయకుండా ఫోర్ ఇచ్చేశాడు. వరల్డ్ కప్​లో ఇంతకుముందు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ధర్మశాల్ గ్రౌండ్​లో ఔట్​ఫీల్డ్ అస్సలు బాగోలేదని.. అది జారుతోందని చెప్పాడు. ఇక్కడ మ్యాచులు ఆడుతూ చాలా మంది క్రికెటర్స్ జారిపడ్డారని తెలుస్తోంది. ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది. అనవసరంగా బుమ్రాను ట్రోల్ చేస్తున్నారని.. తప్పు అతడిది కాదని భారత ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. బుమ్రా మిస్ ఫీల్డ్ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: కోహ్లీ తీరుపై జడేజా అసహనం! గ్రౌండ్​లోనే కోపంగా!