Nidhan
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు చరిత్ర సృష్టించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు చరిత్ర సృష్టించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు.
Nidhan
ఏ ప్లేయర్‌కైనా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అలవాటు పడాలన్నా, తాము ఆడే జట్లలో చోటును పదిలపర్చుకోవాలన్నా కొంత టైమ్ అవసరం. కానీ కొందరు ఆటగాళ్లు అవకాశం వచ్చిందే తడవుగా రెచ్చిపోయి ఆడుతుంటారు. తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లలోనూ టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోతారు. ఈ కోవలోకే వస్తాడు భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఆడింది తక్కువ మ్యాచులే అయినా నిలకడైన ఆటతీరు, సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొడుతూ టీమ్ మేనేజ్మెంట్ తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడతను. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతడ్ని ఆపడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కావడం లేదు. నిజమైన బజ్‌బాల్ అంటే ఏంటో ఇంగ్లీష్ టీమ్‌కు అతడు రుచి చూపిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో 4 మ్యాచులు ఆడిన ఈ కుర్ర బ్యాటర్.. 93.57 యావరేజ్‌తో ఏకంగా 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడే టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లీష్ టీమ్‌పై ఏకంగా 2 డబుల్ సెంచరీలు బాదాడు జైస్వాల్. రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న ఈ ముంబైకర్.. క్రికెట్లో అరుదైన ఘనతను అందుకునేందుకు ఉరకలెత్తుతున్నాడు. మార్చి 7వ తేదీన ధర్మశాల వేదికగా మొదలుకానున్న ఐదో టెస్టుకు ముందు జైస్వాల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆఖరి టెస్టులో మరో పరుగు చేస్తే.. ఇంగ్లండ్ సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ (655) రికార్డును జైస్వాల్ బ్రేక్ చేస్తాడు. రాంచీ టెస్టులో కోహ్లీతో సమానంగా నిలిచిన యంగ్ బ్యాటర్.. ఇంకో పరుగు చేస్తే అతడ్ని దాటేస్తాడు.
ధర్మశాల టెస్టులో మరో రికార్డు కూడా యశస్వి జైస్వాల్‌ను ఊరిస్తోంది. అతడు మరో 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (692) రికార్డును జైస్వాల్ అధిగమిస్తాడు. ఐదో టెస్ట్‌లో అతడు రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. కాబట్టి 38 పరుగులు చేయడం ఈజీనే. ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్‌లో ఇంకో డబుల్ సెంచరీ బాదినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాంటప్పుడు ముప్పై ఎనిమిది పరుగులు చేయడం పెద్ద లెక్కే కాదు. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. మరి.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్న జైస్వాల్.. కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: WPLలో ఊహించని ఘటన.. లేడీ క్రికెటర్లపైకి దూసుకొచ్చిన ఫ్యాన్! ఆ తర్వాత..