Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడే టీమిండియా ఫ్యూచర్ అని అంటున్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడే టీమిండియా ఫ్యూచర్ అని అంటున్నారు.
Nidhan
క్రికెట్లో ఏ టీమ్‌లోనైనా మంచి ఓపెనింగ్ జోడీ ఉండటం చాలా ముఖ్యం. ఓపెనర్లు గుడ్ స్టార్ట్స్ అందిస్తే జట్టు భారీ స్కోర్లు చేయడం, బిగ్ టార్గెట్స్ ఛేజ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే మంచి ఓపెనర్ల కోసం టీమ్స్ అన్వేషిస్తుంటాయి. భారత జట్టునూ ఈ సమస్య వేధిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో ఓ సాలిడ్ ఓపెనర్ ఉన్నా అతడికి సరైన పార్ట్నర్ దొరకడం లేదు. శుబ్‌మన్ గిల్ వన్డేల్లో మాత్రం ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు. దీంతో మిగిలిన ఫార్మాట్లలో హిట్‌మ్యాన్‌కు జోడీ కోసం టీమ్ మేనేజ్మెంట్ వెతుకులాట స్టార్ట్ చేసింది. అయితే దీనికి ఫుల్స్టాప్ పెట్టాడు యశస్వి జైస్వాల్. టీ20లతో పాటు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాది తన ప్లేస్‌ను మరింత పక్కా చేసుకున్నాడు. అందరూ ఫెయిలైన చోట అతడు మాత్రం ద్విశతకంతో చెలరేగాడు. దీంతో జైస్వాల్‌ను ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. దీనిపై భారత మాజీ ఓపెనర్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. జైస్వాల్‌ను హీరోను చేయొద్దన్నాడు.
జైస్వాల్‌ను అనవసరంగా హీరోను చేయొద్దని.. అతడ్ని తన ఆట తనను ఆడుకోనివ్వాలని కోరాడు గంభీర్. యశస్వి సాధించిన ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల అతడి మీద ఒత్తిడి పెరుగుతుందని గౌతీ హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్‌కు కంగ్రాట్స్. అతడ్ని తన ఆట తనను ఆడుకోనివ్వండి. లేకపోతే అనవసరంగా ఒత్తిడి పెరిగి న్యాచురల్ గేమ్ దెబ్బ తింటుంది. గతంలోనూ ఇలా మీడియా కొందరు ఆటగాళ్ల ఘనతలను చాలా ఎక్కువ చేసి చూపించింది. వారికి ట్యాగ్లు ఇచ్చి ప్రెజర్ పెంచింది. దీంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేక కెరీర్లు ఇబ్బందుల్లో పడ్డాయి’ అని గంభీర్ గుర్తుచేశాడు. జైస్వాల్‌ను హీరో చేయకుండా అలాగే వదిలేస్తే అతడు మరింత స్వేచ్ఛగా తన న్యాచురల్ గేమ్ ఆడతాడని గౌతీ సూచించాడు.
వైజాగ్ టెస్టులో శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ ఆడిన తీరు మీదా గంభీర్ స్పందించాడు. గిల్, అయ్యర్ తమ ఇన్నింగ్స్‌లను బాగానే స్టార్ట్ చేసినా భారీ స్కోర్లు చేయలేకపోయారని.. వాళ్లు గాడిలో పడేందుకు కొంత టైమ్ పడుతుందని పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ క్వాలిటీ బ్యాటర్స్ అని.. అయితే టీమ్‌లో సెటిల్ అయ్యేందుకు వారికి కొంచెం సమయం ఇవ్వాలని తెలిపాడు. గిల్, అయ్యర్లు గతంలోనూ ఇలాగే పుంజుకున్నారని.. అందుకే ఇంకా టీమిండియాకు ఆడుతున్నారని గంభీర్ వివరించాడు. జైస్వాల్‌పై గౌతీ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంభీర్ చెప్పింది కరెక్ట్ అని.. ఎక్కువ హైప్ ఇస్తే జైస్వాల్ మీద ప్రెజర్ పెరిగే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. జైస్వాల్‌ను హీరో చేయొద్దంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Gautam Gambhir congratulated the emerging talent but cautioned against overhyping cricket sensations in India.https://t.co/iQrcLoqYMf
— CricTracker (@Cricketracker) February 3, 2024
VIDEO | “We need to support the young players. We should give them time, as they are quality players, and they have demonstrated it in the past with their performances. That is why they are playing for India,” says former cricketer Gautam Gambhir on Shubman Gill and Shreyas Iyer… pic.twitter.com/WkENyQXxUF
— Press Trust of India (@PTI_News) February 3, 2024