Nidhan
వైజాగ్ టెస్ట్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిపడేశాడు.
వైజాగ్ టెస్ట్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిపడేశాడు.
Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. వైజాగ్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. అపోజిషన్ టీమ్ బజ్‌బాల్ క్రికెట్‌కు యష్బాల్ ఫార్ములాతో దిమ్మతిరిగేలా చేశాడు. 151 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారీ సిక్స్‌తో ఈ మైల్‌స్టోన్‌ను అందుకోవడం విశేషం. ఇది అతడి కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇంగ్లండ్‌పై అతడికి ఇది మెయిడిన్ సెంచరీ. కెప్టెన్ రోహిత్ శర్మ (14)తో పాటు ఫస్ట్ డౌన్లో ఆడిన శుబ్‌మన్ గిల్ (34) త్వరగానే ఔటైనా జైస్వాల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మొదట్లో పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో నెమ్మదిగా ఆడాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్రీజులో నిలదొక్కుకోవడం మీద ఫోకస్ చేశాడు.
వికెట్ నుంచి పేస్‌కు మద్దతు లభిస్తుండటంతో ఇంగ్లండ్ వెటరన్ సీమర్ జేమ్స్ అండర్సన్ బాగా బౌలింగ్ చేశాడు. పర్ఫెక్ట్ లెంగ్త్‌లో బంతుల్ని విసురుతూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మధ్యమధ్యలో స్వింగ్ డెలివరీస్తోనూ వాళ్లను పరీక్షించాడు. ఈ క్రమంలో రోహిత్ స్పిన్నర్ బషీర్‌కు చిక్కగా.. అండర్సన్ బౌలింగ్‌లో గిల్ ఔట్ అయ్యాడు. అయినా పట్టుదలతో ఆడిన జైస్వాల్.. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్‌తో తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన జైస్వాల్, గిల్‌తో రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (27) తోడ్పాటు అందించడంతో స్కోరును 150 దాటించాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. చెత్త బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ వికెట్‌ను కాపాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. జైస్వాల్ ఆడుతున్న తీరును సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలా ఆడితే అతడికి తిరుగుండదని చెబుతున్నారు. టీమ్‌లో ఉన్న మిగతా యంగ్‌స్టర్స్ టెస్టుల్లో ఎలా ఆడాలనేది యశస్వీని చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం భారత్ 52 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులతో ఉంది. జైస్వాల్ సెంచరీ తర్వాత అయ్యర్ ఔట్ అయ్యాడు. టీమిండియా భారీ స్కోరు సాధించాలంటే అది జైస్వాల్‌తోనే సాధ్యం. అతడు ఈ సెంచరీని డబుల్ సెంచరీగా మలిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు. మరి.. జైస్వాల్ సూపర్ సెంచరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HUNDRED BY YASHASVI JAISWAL…!!!
What an innings, he missed out on the previous game, but completed his century today. What a talent. pic.twitter.com/twS61CTqiS
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024
ఇదీ చదవండి: Rohit Sharma: ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా విఫలం! రోహిత్ శర్మకు ఏమైంది?
A TEST HUNDRED WITH A SIX…!!! 🤯
– Yashasvi Jaiswal special in Vizag.pic.twitter.com/C3QuPjjRBQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024