iDreamPost

Rohit Sharma: ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా విఫలం! రోహిత్‌ శర్మకు ఏమైంది?

  • Published Feb 02, 2024 | 1:01 PMUpdated Feb 02, 2024 | 1:01 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయ్యాడు. దీంతో అతని ఆటతో పాటు అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయ్యాడు. దీంతో అతని ఆటతో పాటు అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 02, 2024 | 1:01 PMUpdated Feb 02, 2024 | 1:01 PM
Rohit Sharma: ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా విఫలం! రోహిత్‌ శర్మకు ఏమైంది?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన బ్యాడ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌లో విఫలమైన రోహిత్‌.. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లోనూ ఫెయిల్‌ అవుతున్నాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌, రెండో ఇన్నింగ్స్‌లో 39 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ వైఫల్యం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపింది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది భారత్‌. ఇక కనీసం రెండో టెస్టులైనా టీమిండియా అదరగొడుతుందేమో.. ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-1తో లెక్క సరిచేస్తుందేమో అని భావిస్తే.. ఆరంభమే బాగా లేదు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియా.. ఆరంభంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది.

41 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి.. ఓ 20 ఏళ్ల కుర్ర బౌలర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కనీసం ఒక్క ఫోర్ కూడా కొట్టకపోవడం గమనార్హం. పైగా తొలి మ్యాచ్‌ ఆడుతున్న షోయబ్‌ బషీర్‌ అనే 20 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌లో అవుటై.. అతని అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో తొలి వికెట్‌గా నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గాను రోహిత్‌ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలపై క్రికెట్‌ నిపుణులతో పాటు భారత క్రికెట్‌ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండో టెస్టు కోసం రోహిత్‌ శర్మ ఎంపిక చేసుకున్న ప్లేయింగ్‌ ఎలెవన్‌పై అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఈ ప్లేయింగ్‌ ఎలెవన్‌పై క్రికెట్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

what happend to rohit

తొలి టెస్టులో గాయపడిన కేఎల్‌ రాహుల్‌, జడేజా రెండో టెస్ట్‌కు దూరం అవ్వడంతో వారి ప్లేసులు భర్తీ చేయాల్సి వచ్చింది. వీరిలో కేఎల్‌ రాహుల్‌ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను కాకుండా రజత్‌ పటీదార్‌ను తీసుకున్నాడు. రాహుల్‌ ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్‌ మంచి పిక్‌. పైగా దేశవాళి క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఆడే స్థానం కూడా అదే. పైగా పటీదార్‌ కంటే సర్ఫరాజ్‌కే మంచి రికార్డ్‌ ఉంది. అలాగే పటీదార్‌ టాపర్డర్‌ బ్యాటర్‌, ఇప్పుడు అతన్ని మిడిల్డార్‌లో ఆడించాలి. రోహిత్‌ చేసిన ఫస్ట్‌ మిస్టేక్‌ ఇదే. ఇక జడేజా స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకున్నాడు. జడేజా ఆల్‌రౌండర్‌. బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో పరుగులు చేసే ఆటగాడితో రీప్లేస్‌ చేయకుండా కుల్దీప్‌ను తీసుకున్నాడు. అతని బదులు వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకుని ఉండాల్సింది.

ఇక మరో బిగ్‌ మిస్టేక్‌ ఏంటంటే.. ఇంకా శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై నమ్మకం ఉంచడం. వారిద్దరు అస్సలు ఫామ్‌లోనే లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ అనే కాదు.. దాదాపు గత 10, 12 ఇన్నింగ్సుల్లో వాళ్లకు ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు. అయినా కూడా వారిద్దరిలో ఒక్కరిని కూడా పక్కనపెట్టకుండా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ లాంటి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుండా రోహిత్‌ పెద్ద తప్పు చేస్తున్నాడు. ఇలా కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా రోహిత్‌ విఫలం అవుతుండటం టీమిండియాను దెబ్బతీస్తోంది. కానీ, ఒక్కసారి ఫామ్‌ అందుకుంటే.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించగల ఆటగాడు రోహిత్‌ శర్మ అని, తిరిగి ఫామ్‌ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజే​యండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి