Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.
Nidhan
భారత క్రికెట్లో అతి తక్కువ టైమ్‌లో స్టార్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న వారిలో శుబ్‌మన్ గిల్ ఒకడు. 24 ఏళ్ల ఈ యంగ్ బ్యాటర్ అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2022-23 సీజన్లో అతడి బ్యాట్ ఒక రేంజ్లో గర్జించింది. అందుకే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా అతడికి పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇచ్చి సత్కరించింది బీసీసీఐ. అయితే వన్డేల్లో బాగా ఆడుతున్న గిల్.. టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. దీంతో అతడ్ని టీమ్‌లో నుంచి తీసేయాలనే డిమాండ్లు పెరిగాయి. ఫామ్‌లో లేడని, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా విఫలమవుతున్నాడని, జట్టులో అవసరమా? అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో వీటన్నింటికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు గిల్. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్బ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ శతకంతో లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ బాదాడు శుబ్‌మన్ గిల్. 147 బంతులు ఎదుర్కొన్న యంగ్ బ్యాటర్.. 11 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 104 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17) తక్కువ స్కోర్లకు వెనుదిరిగిన వేళ.. క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించాడు. శ్రేయస్ అయ్యర్ (29) ఔటయ్యాక ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు గిల్. అక్షర్ పటేల్ (45)తో కలసి స్కోరును 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 130 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా 24 ఏళ్ల వయసులో 10 సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
24 ఏళ్ల వయసులో 10 ఇంటర్నేషనల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ల లిస్టులో గిల్ మూడో ప్లేసులో నిలిచాడు. అతడి కంటే ముందు సచిన్, కోహ్లీ ఈ ఘనత అందుకున్నారు. దీంతో గిల్‌ను భారత అభిమానులు మెచ్చుకుంటున్నారు. టీమిండియా ఫ్యూచర్ సేఫ్‌గా ఉందని.. శుబ్‌మన్ జట్టును ముందుండి నడిపిస్తాడని అంటున్నారు. సచిన్, కోహ్లీలు తమ జమానాలో గ్రేట్ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్నారని.. గిల్ కూడా వారి బాటలో నడుస్తున్నాడని చెప్పేందుకు ఈ రికార్డే సాక్ష్యమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ఉన్న ఫామ్, అతడి ఫిట్నెస్, మ్యాచ్ మ్యాచ్‌కు ఇంప్రూవ్మెంట్ అవుతున్న తీరు, అతడి టెంప్రమెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోందని చెబుతున్నారు. గిల్ ఇదే తరహాలో తన జోరును కొనసాగించాలని కోరుకుంటున్నారు. మరి.. సచిన్, కోహ్లీ సరసన గిల్ చోటు దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Indian players with 10 international centuries at the age of 24:
– Sachin Tendulkar.
– Virat Kohli.
– Shubman Gill.3 generations of Indian cricket..!!!! 🫡 pic.twitter.com/xamuvDSOnH
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 4, 2024
WELCOME BACK, SHUBMAN GILL…!!! ⭐
What a brilliant century against England in the 3rd innings when India needed the most. The most important knock for Gill, he’s perfectly stepped up and delivered. 🫡 pic.twitter.com/MCFPG4Qj1L
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 4, 2024