iDreamPost
android-app
ios-app

IND vs ENG: సర్ఫరాజ్ డెబ్యూపై తండ్రి ఎమోషనల్ కామెంట్స్.. ఆ రోజుల్ని తలచుకొని..!

  • Published Feb 16, 2024 | 8:11 AM Updated Updated Feb 16, 2024 | 8:11 AM

ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో డెబ్యూ ఇచ్చిన నయా బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ సంచలన ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. కొడుకు అరంగేట్రంపై అతడి తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో డెబ్యూ ఇచ్చిన నయా బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ సంచలన ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. కొడుకు అరంగేట్రంపై అతడి తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

  • Published Feb 16, 2024 | 8:11 AMUpdated Feb 16, 2024 | 8:11 AM
IND vs ENG: సర్ఫరాజ్ డెబ్యూపై తండ్రి ఎమోషనల్ కామెంట్స్.. ఆ రోజుల్ని తలచుకొని..!

సర్ఫరాజ్ ఖాన్.. భారత క్రికెట్​లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. ఒకే ఒక్క ఇన్నింగ్స్​తో అభిమానులు, సీనియర్ క్రికెటర్లు, అనలిస్టులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు సర్ఫరాజ్. ఇలాంటి క్రికెటర్​నా ఇన్నాళ్లూ టీమ్​కు దూరంగా ఉంచారు? అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంత టాలెంట్ ఉన్నోడ్ని జట్టులోకి తీసుకోకుండా తప్పు చేశారంటున్నారు. అయితే ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశారని.. సర్ఫరాజ్​ను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో బిగ్ స్టార్​గా అవతరిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతడు ఈ స్థాయికి చేరడంలో తండ్రి నౌషద్ ఖాన్ పాత్ర ఎంతో కీలకం. సర్ఫరాజ్​కు తండ్రి మాత్రమే కాదు.. ఆయనే కోచ్​ కూడా. కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూనే పిల్లల కెరీర్​ను తీర్చిదిద్దారు. సర్ఫరాజ్ ఇక్కడి వరకు చేరేందుకు అహర్నిషలు కష్టపడటమే కాదు.. ఎన్నో త్యాగాలు కూడా చేశారు. అందుకే నిన్న సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్ అందుకోగానే నౌషద్ ఆనందంతో ఏడ్చేశారు. ఆ తర్వాత కామెంట్రీ బాక్స్​లో ప్రత్యక్షమైన ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

సర్ఫరాజ్ పడిన కష్టం మరెవరికీ రాకూడదన్నారు నౌషద్ ఖాన్. ఈ స్థాయి వరకు చేరుకునేందుకు తన కొడుకు ఎంతో తీవ్రంగా శ్రమించాడని చెప్పారు. కామెంట్రీ బాక్స్​లో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో కలసి ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సమయంలో ఆయన్ను ఆకాశ్ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. సర్ఫరాజ్ డెబ్యూకు ఇంత ఎక్కువ టైమ్ పడుతుందని మీరు ఊహించారా? అని ప్రశ్నించారు. దీనికి ఎమోషనల్ అయిన నౌషద్.. ఓ కవిత రూపంలో సమాధానం ఇచ్చారు. ‘చీకటి పోవడానికి చాలా సమయం పడుతుంది. సూర్యుడు నేను కోరుకున్నప్పుడు ఉదయించడు కదా!’ అని ఆన్సర్ ఇచ్చారు. సర్ఫరాజ్ తండ్రి చెప్పిన కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన కవితకు గూడార్థం ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది అభిమానులు ప్రయత్నిస్తున్నారు.

Dad's emotional comments on Sarfaraz's debut

సర్ఫరాజ్ డొమెస్టిక్ లెవల్​లో గత కొన్నేళ్లుగా అదరగొడుతూ వస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ టీమిండియా తలుపులను గట్టిగా తట్టాడు. కానీ సెలక్టర్లు మాత్రం కరుణించలేదు. టీమ్​లో స్టార్లు పాతుకుపోవడంతో ఈ యంగ్​స్టర్​కు ఛాన్స్ రాలేదు. అధిక బరువును కారణంగా చూపుతూ అతడ్ని సెలక్షన్​కు దూరంగా పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎట్టకేలకు ఇంగ్లండ్​తో చివరి మూడు టెస్టులకు పిలుపు రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రాజ్​కోట్ టెస్టులో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. 66 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 62 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కామెంట్రీ సందర్భంగా అతడి తండ్రి చెప్పిన కవిత వైరల్ అవుతోంది. సర్ఫరాజ్ జీవితంలో చీకటి పోయి వెలుగు రావడానికి చాలా టైమ్ పట్టిందని.. కానీ అది తమ చేతుల్లో లేదని ఆ కవిత ద్వారా నౌషద్ చెప్పకనే చెప్పారని నెటిజన్స్ అంటున్నారు. ఇక మీదట అతడి లైఫ్ మొత్తం వెలుగులేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి.. సర్ఫరాజ్ తండ్రి వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. అయినా బాధపడుతున్న ఫ్యాన్స్! కారణం?